Srireddy : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విషయం విదితమే. నిన్న మొన్నటి వరకు ఏపీలో టిక్కెట్ల రేట్లు అని ప్రశ్నించుకున్నారు. ఇప్పుడు చూస్తుంటే టాపిక్ డైవర్ట్ అయినట్లు కనిపిస్తోంది. మోహన్ బాబు ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాయడంతో చిరంజీవి తెరపైకి వచ్చారు. తాను టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా ఉండలేనన్నారు. కావాలంటే ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
అయితే చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా ఉండేందుకు చిరంజీవికి అర్హత లేదని వ్యాఖ్యానించింది. మీ బోడి పెద్దరికం ఎవడికి కావాలి, పెద్ద దిక్కుగా ఉండేందుకు బాలకృష్ణ లేదా మోహన్‌బాబు అయితే కరెక్ట్‌గా సరిపోతారు, అయినా సినిమాలకు సమస్యలు ఉంటే నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు వెళ్లి పరిష్కరించుకోవాలి, కానీ అందులో హీరోల పెత్తనం ఏంటి ? అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.
కాగా చిరంజీవిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ కాగా.. చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని.. మెగా అభిమానులు శ్రీరెడ్డిపై తిట్ల దండకం అందుకుంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు టిక్కెట్ల ధరల విషయం కాస్తా.. డైవర్ట్ అయి టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు అనే వరకు వెళ్లింది. మరి ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…