Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌లలో రాణిస్తున్నాడు. ఇప్పుడు ఏఎంబీ థియేటర్ నడిపిస్తున్న మహేష్ బాబు తెలుగులో ఆన్ లైన్ విద్యా బోధన కోసం కొత్త యాప్ ని తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. దీనికి సంబంధించి ఒక మల్టీ నేషనల్ కంపెనీ తో చర్చలు జరుపుతున్నాడని , దీంట్లో మహేష్ బాబు దాదాపుగా రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
మహేష్ బాబుతోపాటు ఒక మల్టీ నేషనల్ కంపెనీ భాగస్వామ్యంలో కూడా ఇది రూపొందుతుందని సమాచారం. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానుంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్.. జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…