Bigg Boss 5 : స‌న్నీ, ష‌ణ్ముఖ్, మాన‌స్ క‌ళ్లు తెరిపించిన నాగార్జున‌..!

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌స్ 5 కార్య‌క్ర‌మంలో ‘నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా’ టాస్క్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ టాస్క్‌లో స‌న్నీని గెలిపించేందుకు చాలా కృషి చేసింది కాజ‌ల్. అంద‌రితో గొడ‌వ‌ల‌కు కూడా దిగింది. ఎన్ని రౌండ్లయినా ఒక్కసారైనా ఫొటో కాలని సన్నీకి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ దక్కడంతో అతడు సంతోషంతో స్టెప్పులేశాడు. అయితే సిరి, యానీ మాత్రం.. డ్రామాలాడుతున్నారంటూ కాజల్‌ను ఏకిపారేశారు. యానీ అయితే వెక్కెక్కి ఏడుస్తూ వాళ్లతో మాట్లాడేది లేదని శపథం చేసింది.

తర్వాత నాగార్జున.. ఈ వారం బెస్ట్‌ పెర్ఫామర్‌కు బంగారం, వరస్ట్‌ పెర్ఫామర్‌కు బొగ్గు ఇవ్వాలని ఓ టాస్క్‌ ఇచ్చాడు. అందులో భాగంగా మాజీ కెప్టెన్‌ రవి.. ప్రియాంక సింగ్‌, మానస్‌, యానీ, శ్రీరామ్‌లకు బంగారం ఇచ్చాడు. సన్నీ, కాజల్‌, సిరి, షణ్నుతోపాటు తనకు తాను బొగ్గిచ్చుకున్నాడు. ఈ సందర్భంగా నాగ్‌.. స్విమ్మింగ్‌ టాస్క్‌లో సన్నీ మీద పగ తీర్చుకున్నావ్‌ కదూ ! అని రవి మీద అనుమానం వ్యక్తం చేయగా అతడు అలాంటిదేం లేదని బుకాయించాడు.

బాత్రూం లోపల, బయట తల కొట్టుకుంటూ నిన్ను నువ్వు ఎందుకు గాయపర్చుకున్నావని నాగ్‌ సిరిని ప్రశ్నించాడు. కోట్లమంది నిన్ను చూసి ఈ అమ్మాయిలా ఉండాలనుకోవాలి కానీ ఈవిడలా మాత్రం ఉండకూడదు అని భావిస్తారని సుద్దులు చెప్పాడు. తన సమస్యేంటో చెప్పమన్నాడు. దీంతో ఓపెన్‌ అయిన సిరి.. ‘నేను ఎమోషనల్‌ పర్సన్‌. నేను ఎదుటివాళ్లను హర్ట్‌ చేసే వ్యక్తిని కాను.

ఎవరేం అన్నా నన్ను నేనే బాధపెట్టుకుంటాను. రోజులు గడిచేకొద్దీ షణ్నుతో నా కనెక్షన్‌ ఇంకా ఎమోషనల్‌ అయిపోతోంది. ఇది తప్పా ? రైటా ? తెలియట్లేదు. లైఫ్‌లో ఎప్పుడూ ఇలా అవలేదు. కానీ నేను నటించడం లేదు. నాకు ఈ ఫీలింగ్‌ తప్పని తెలిసినా సరే చేయాలనిపిస్తే చేసేస్తున్నా’ అని చెప్తూ బాధపడింది సిరి. ఇంకోసారి ఇలా గాయపర్చుకుంటే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి పంపించేస్తానని నాగ్‌ వార్నింగ్‌ ఇవ్వగా మరోసారి రిపీట్‌ చేయనని మాటిచ్చింది సిరి.

ఇక షణ్ను.. మెంటల్లీ వీక్‌ అయిపోయాను. సిరి అలా తనను తాను గాయపర్చుకోవడానికి కారణం నేనే, అంటే తప్పు నాదే అని అంగీకరించాడు. దీప్తిని మిస్‌ అవుతుంటే, ఇక్కడ ఉండలేకపోతే ఈ క్షణమే వెళ్లిపోమని గేట్లు తెరిచాడు నాగ్‌. పదేపదే ఇలా ట్రిప్‌ అవ్వకూడదని సూచించాడు. తర్వాత మానస్‌ కన్ఫెషన్‌ రూమ్‌లోకి వచ్చాడు. ప్రియాంక నన్ను మాత్రమే ఎక్కువగా నమ్ముతూ కొన్నిసార్లు గేమ్‌ కన్నా నామీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని, అది తనకు ఇబ్బందిగా మారిందన్నాడు.

మానస్‌ మాటలు విన్నాక నాగ్‌.. ప్రియాంక అతడి కోసం ఏడ్చేసిన వీడియో చూపించాడు. ఆమె ఫీలింగ్స్‌ ఎక్కడివరకు వెళ్తున్నాయో చూసుకోమన్నాడు. తను నొచ్చుకుంటుందని ఏమీ చెప్పకపోతే పరిస్థితులు చేయి దాటిపోతాయని హెచ్చరించాడు. కాజల్‌తో ప్రవర్తించిన తీరు బాగోలేదని యానీకి చురకలు అంటించాడు నాగ్‌. వెక్కిరించడం కొంతవరకే బాగుంటుందని, కానీ అది హద్దులు మీరుతోందని హెచ్చరించాడు. అనంతరం శ్రీరామచంద్ర, సన్నీ సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు నాగ్‌.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM