Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. సర్కారు వారి పాట చిత్రం తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు. అయితే సర్కారు వారి పాట విషయానికి వస్తే మహేశ్ బాబు ఈ సినిమాలో ఎంత ఎనర్జిటిక్ గా, రొమాంటిక్ గా కనిపించబోతున్నాడని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్ చూస్తే అర్థమైపోతోంది. మరోవైపు అభిమానులను, మాస్ ఆడియెన్స్ ను ఖుషి చేసేందుకు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా తెరకెక్కించారంట పరుశురామ్.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 133 మిలియన్ వ్యూస్ ను రాబట్టి దూసుకుపోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట మినహా షూటింగ్ పూర్తైయినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ఈ సినిమా ఓ సోషల్ మెసేజ్‌తో వస్తోందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ వడ్డీ రికవరీ ఏజెంట్ అజయ్‌గా నటించాడని, అక్కడ ఒక పెద్ద సమస్యను పరిష్కరించడానికి తన గ్రామానికి తిరిగి వెళ్తాడని కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం కూడా మహర్షి మాదిరిగా మరో మెసేజ్ ఓరియెంటెడ్ అవుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతనిని కమర్షియల్ హీరో పాత్రలో చూడాలని ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా వస్తున్న వార్తలు అభిమానులని నిరుత్సాహపరుస్తున్నాయి.