Keerthy Suresh : మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కిస్తున్న చిత్రం.. సర్కారు వారి పాట. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటిస్తున్న కీర్తి సురేష్ విషయంలో ఏదో క్లారిటీ మిస్ అవుతుందని మహేష్ అభిమానులు కలత చెందుతున్నారు. నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. మహానటి తర్వాత వరుసగా మూడు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి.. వీటిలో పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలకు అంకితమైతే గుడ్‌లక్ సఖి ఒక్కటే బిగ్‌స్క్రీన్స్‌కి నోచుకుంది.
తలైవా నటించిన అన్నాత్తె చిత్రంలో చెల్లెలిగా కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా కూడా నిరాశపరిచిన బాపతే. ఇక ఎప్పుడో కంప్లీటైన తమిళ్ మూవీ సానికాయితం కూడా డిజిటల్ స్క్రీన్స్‌కే పరిమితమవుతోంది. మెగాస్టార్ మూవీ భోళాశంకర్‌లో సోదరి పాత్రకే పరిమితమవుతోంది. సర్కారువారి పాట వచ్చేలోగా ఒక్కటంటే ఒక్క హిట్టయినా కొట్టి చూపించు కళావతీ.. అని వేడుకుంటున్నారు సూపర్‌స్టార్ ఫ్యాన్స్. కానీ ఈ అమ్మడు ఈ చిత్రాన్ని పూర్తిగా పక్కకు పెట్టినట్టు పడేస్తోంది. మిగతా సినిమాలపై పెట్టిన శ్రద్ధ ఈ సినిమాపై చూపించడం లేదని కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో సర్కారు వారి పాట సినిమా గురించి ఎలాంటి పోస్ట్‌లు పెట్టడం లేదని, కనీసం ప్రచారాలు కూడా చేయడం లేదని కొందరు వాపోతున్నారు. తమిళ సినిమాలపై పెట్టిన శ్రద్ధ తెలుగు సినిమాలపై ఎందుకు పెట్టడం లేదంటూ.. మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా సర్కారువారి పాట సినిమాలోని మొదటి పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండవుతోంది. కానీ.. అందులో మహేష్‌బాబు మతిపోగొడుతున్న కళావతి దగ్గర మాత్రం ఏదో క్లారిటీ మిస్సవుతోందట. మిగతా టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా వరసబెట్టి సినిమాలు చేస్తున్నా ఇంకా ఏదో వెలితిగా అనిపిస్తోందట. మరి కీర్తి సురేష్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…