Naga Babu : బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెల్లవారుఝామున టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తుండగా, ఇందులో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే.
డ్రగ్స్ కేసులో మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు బయటకు రావడంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. నిహారిక విషయంలో అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దని.. నిహారిక వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని నాగబాబు స్పష్టం చేశారు. ఓ వీడియో విడుదల చేస్తూ ఇందులో పలు విషయాలు వెల్లడించారు. డ్రగ్స్ కేసుపై నేను స్పందించడానికి గల కారణం.. పబ్‌పై దాడులు జరిగిన సమయంలో నా కూతురు నిహారిక అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
నిహారికకు సంబంధించినంత వరకు ఆమె చాలా క్లియర్. ఇక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిహారిక విషయంలో ఎటువంటి తప్పు లేదు. సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దు అని నాగబాబు విజ్ఞప్తి చేశారు. మరి నాగబాబు విజ్ఞప్తి మేరకు అయిన ప్రచారాలు ఆగుతాయా అనేది చూడాలి. మరో వైపు దర్శకుడు సాయి రాజేష్ కూడా నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని తెలియజేశాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…