Mahesh Babu : సాధారణంగా హీరోలు తమ సినిమాలు హిట్ అయితే ఓకే. లేదంటే కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా వెకేషన్స్‌కు వెళ్తుంటారు. ఇక కొందరు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. ఇలా హీరోలు తమ సినిమాలు ఫ్లాప్ అయితే భిన్న రకాలుగా ప్రవర్తిస్తారు. కానీ ఏ హీరోకు అయినా.. ఫ్లాప్, హిట్ అనేవి ముందుగా తెలియవు. అది లక్ మీద ఆధార పడి ఉంటుంది. కొన్నిసార్లు ఎంత మంచి కథతో సినిమా తీసినా నడవవు. అది అంతే. అయితే మహేష్ బాబు తన సినిమాలు ఫ్లాప్ అయితే ఏం చేస్తారో చెప్పేశారు.
సినిమా ఫ్లాప్ అనేది నాకు అత్యంత బాధాకరమైన విషయం. నా సినిమా ఫ్లాప్ అయితే చాలా విచారిస్తాను. బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను. నా సినిమా ఫ్లాప్ అయిందన్న విషయాన్ని అర్థం చేసుకుంటాను. అందుకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను. 2-3 రోజుల పాటు నా గది నుంచి బయటకు రాను. ఏడుస్తూనే ఉంటాను. చివరకు విచారం నుంచి బయట పడతాను.. అని మహేష్ తెలిపారు.
బాలకృష్ణతో తాజాగా చేసిన అన్ స్టాపబుల్ షో చివరి ఎపిసోడ్‌కు మహేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా చెప్పారు. ఇక మహేష్ తదుపరి చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు. ఆ మూవీ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఇందులో పూజా హెగ్డె నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీని లాంచ్ చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…