Khiladi Movie : పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైన పుష్ప సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. దీన్ని బట్టి చూస్తే వారు భాషతో సంబంధం లేకుండా ఒరిజినల్ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు స్పష్టమైంది. దీంతో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ఖిలాడి మేకర్స్ ఆ మూవీని హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఖిలాడి మూవీని విడుదల చేయనున్నారు. అయితే అదే రోజున ఈ మూవీ హిందీలోనూ విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఖిలాడి మూవీ ద్వారా రవితేజ పాన్ ఇండియా లెవల్‌లో పరిచయం కానున్నారు. ప్రస్తుతం దక్షిణాది చిత్రాలకు హిందీ మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఏర్పడింది. అందువల్లే ఖిలాడిని హిందీలోనూ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నామని.. మేకర్స్ తెలిపారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 11వ తేదీన ఖిలాడి మూవీ తెలుగుతోపాటు హిందీలోనూ విడుదల కానుంది.
ఈ మూవీకి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా.. రవితేజ హీరోగా డ్యుయల్ రోల్ పోషించారు. పెన్ స్టూడియోస్, ఎ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఖిలాడి మూవీ ఒరిజినల్ కథ కనుక హిందీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని మేకర్స్ తెలిపారు. ఇటీవల విడుదలైన పుష్ప సినిమా హిందీలోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందువల్లే ఖిలాడిని అక్కడ విడుదల చేస్తున్నామని, ఈ మూవీ హిందీ ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. అయితే హిందీ బాక్సాఫీస్ వద్ద ఖిలాడి మూవీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…