Mahaan Movie Review : తమిళ స్టార్ విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్‌లు కలిసి నటించిన మూవీ.. మహాన్. ఈ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని నేరుగా రిలీజ్ చేశారు. కార్తీక సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సిమ్రాన్, సింహా, వాణీ భోజన్, సనత్, ముత్తు కుమార్, ఆడుకళం నరెన్ లు ఇతర కీలకపాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ మూవీని గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కించారు. మరి ఈ మూవీ ప్రేక్షకులను అలరించిందా.. లేదా.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
గాంధీ మహాన్ (విక్రమ్) ఒక కామర్స్ టీచర్. గాంధీ సూచించిన మార్గంలో నడుస్తూ విలువలను పాటిస్తుంటాడు. అయితే తన చిన్ననాటి స్నేహితుడు సత్యవన్ (బాబీ సింహా) ఒకానొక సమయంలో మహాన్‌ను కలుస్తాడు. దీంతో మహాన్ ఒక్కసారిగా మారిపోతాడు. తన స్నేహితుడితో కలిసి మద్యం కాచి విక్రయించడం మొదలు పెడతాడు. దీంతో మహాన్ లిక్కర్ సామ్రాజ్యానికి కింగ్ అవుతాడు. తరువాత అతని కుమారుడు దాదాభాయ్ నౌరోజీ (ధ్రువ్ విక్రమ్) పోలీస్‌గా వస్తాడు. అతను గాంధీ మార్గాన్ని ఫాలో అయ్యేవాడు. ఈ క్రమంలో అతను తండ్రికి ఎదురు వెళ్లాడా ? ఇద్దరి మధ్య ఎలాంటి కథ నడిచింది ? చివరకు ఈ పోరులో ఎవరు నెగ్గారు ? అన్న విషయాలను తెలుసుకోవాలంటే.. ఈ మూవీని చూడాల్సిందే.
ఇక మూవీలో విక్రమ్ విషయానికి వస్తే.. ఆయనొక అద్భుతమైన నటుడు. కనుక ఆయన నటనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. ఈ మూవీలోనూ తన పాత్రలో జీవించాడని చెప్పవచ్చు. ఒక సమయంలో సాధారణ వ్యక్తిగా, ఇంకో సమయంలో మాఫియా లీడర్‌గా ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. అలాగే ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ కూడా కరుడుగట్టిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక తండ్రీ కొడుకుల మధ్య కొన్ని సీన్స్, వాటిల్లో వారు పలికే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక ఈ మూవీలో ఇతర నటీనటులు తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు.
అయితే ఈ సినిమాకు ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్.. స్పీడ్.. గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ అయినా.. మూవీ నెమ్మదిగా సాగుతుంది. ఇదే ప్రేక్షకులకు నచ్చదు. ఇక మూవీ రన్‌టైమ్ ఎక్కువ కావడం వల్ల అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు ఉంటాయి. దీంతో అసలు కథ పక్కదోవ పట్టింది.
ఓవరాల్‌గా చూస్తే మహాన్ సినిమా నెమ్మదిగా సాగే మూవీ అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే అలా అనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే విక్రమ్, ధ్రువ్ విక్రమ్‌ల సీన్స్ బాగుంటాయి. కనుక వారి నటన అంటే ఇష్టం ఉన్నవారు ఈ మూవీని ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…