Macherla Niyojakavargam : యంగ్ హీరో నితిన్ తప్పకుండా హిట్ కొట్టాల్సిందే.. అప్పుడెప్పుడో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఈ యంగ్ హీరోకు సాలిడ్ హిట్ పడలేదు. చెక్, రంగ్ దే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన మ్యాస్ట్రో సినిమా కూడా దారుణంగా నిరాశ పరిచింది. ఇక భారీ ఆశలు పెట్టుకున్న మాచర్ల నియోజ వర్గం మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కింది.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాలో నితిన్ సరసన లేటెస్ట్ సెన్షేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ తన లుక్ మార్చుకుని స్క్రీన్‌పై సందడి చేసినా.. ఆడియన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాలేదు. ట్రైలర్‌లో నితిన్ చెప్పిన డైలాగ్స్, కొన్ని సీన్లు సినిమాపై హైప్ క్రియేట్ చేసినా.. అంచనాలను అందులేకపోయింది. దీంతో మొదటి షో నుంచే ఈ సినిమాపై నెగిటివ్ రిపోర్ట్ రావడంతో డిజాస్టర్ గా నిలిచింది మాచర్ల నియోజక వర్గం.
ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రానుందని తెలుస్తోంది. ఇటీవల ఓటీటీలో సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. సినిమా రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఓటీటీలో మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మాచర్ల నియోజక వర్గం సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 9న ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ మాచర్ల నియోజకవర్గం సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. మరి ఈ సినిమా ఓటీటీలోనైనా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…