MAA : టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్ని గొడవలు జరిగాయో.. ఇప్పుడు అంత సైలెంట్ గా ఉంది. ఒకరికొకరు ఛాలెంజ్ లు, శపథాలు చేసుకుని తీవ్ర వివాదాలకు తెరలేపారు. కానీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారింది. ఈ క్రమంలోనే మంచు విష్ణు మా అసోసియేషన్ కోసం భవన నిర్మాణం చేస్తానని వాగ్దానం చేశారు.
ఎన్నికల సమయంలో అధ్యక్ష పదవి కోసం ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తీరా ఎన్నికలు గెలిచి పదవి చేజిక్కించుకున్నాక.. ఇప్పుడు అసలు విష్ణు బాబులో ఆ స్పీడ్ తగ్గిపోయింది. మా అసోసియేషన్ అధ్యక్ష పదవి హోదాలో సినిమా ఓపెనింగ్స్ కి, ఫంక్షన్లు, ఈవెంట్లకు మంచు విష్ణు హాజరవుతున్నారు.
ఇక మా అసోసియేషన్ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్.. తనకు అసలు మా సభ్యత్వమే వద్దని రాజీనామా చేసి మరీ బయటకు వెళ్ళిపోయారు. ప్రెస్ మీట్స్ పెట్టి.. కోర్టుల వరకు వెళ్ళిన వ్యక్తి కూడా తన సినిమాల్లో తాను బిజీగా మారారు. మా ఎన్నికల్లో ఉన్నో రివేంజ్ డ్రామాలకు ప్లాన్ చేసిన ప్రకాష్ రాజ్ టీమ్ కూడా సినిమాల షూటింగ్ లు వరుసగా మొదలవ్వడంతో ఫుల్ బిజీగా మారారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వార్తలు ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ఫ్యాన్స్ లో ఒకరు.. ప్రకాష్ రాజ్ కు ఓకల్ కార్డ్ దెబ్బతిందని, మరో వారం రోజుల్లో విష్ణు ప్యానల్ ను ప్రశ్నిస్తారని అన్నారు. మరోపక్క.. ప్రకాష్ రాజ్ కు గానీ, ఆయన టీమ్ మెంబర్స్ కి గానీ తమ రివెంజ్ లను తీర్చుకోవడంపై పెద్దగా ఆసక్తి లేదు అనే విషయం ఖరారవుతోంది.
ఏది ఏమైనా.. మా అసోసియేషన్ లో వివాదాలు, సర్దుబాట్లు లాంటి వ్యవహారాలకు కీలక పాత్ర పోషించిన నాగబాబు, సీనియర్ నటుడు నరేష్ లు కూడా సైలెంట్ అయిపోయి ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఇక అసలు సూత్రధారి మోహన్ బాబు కూడా సైలెంట్ గా ఉండటం గమనార్హం.