Maa Elections : నిన్న మొన్నటి వరకు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. చివరికి వ్యక్తిగతంగా దూషించడం కూడా మొదలు పెట్టారు. ఓ దశలో మా ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఆ ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించాయి. రేప్పొద్దున మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌లలో గెలిచిన వారు ఎలా ఉంటారు ? ఓడిన వారు ఏం చేస్తారు ? అన్న స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. కానీ కట్ చేస్తే.. ఇద్దరూ ఆలింగనం చేసుకుని కనిపించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఈ సారి చాలా ఎక్కువగా హడావిడి కనిపించింది. అయితే నిన్న రాత్రి వరకు కూడా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ కు చెందిన సభ్యులు దారుణంగా తిట్టుకున్నారు. కానీ ఈ రోజు (ఆదివారం, అక్టోబర్ 10, 2021) ఎన్నికల వేళనో.. లేదా పెద్దలు సర్ది చెప్పారో.. మరో విషయమో.. తెలియదు కానీ.. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. మోహన్ బాబు తన కుమారుడు విష్ణు చేతిని ప్రకాష్ రాజ్‌కు అందించారు. తరువాత ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు.
ఇక ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ.. మా ఎన్నికలు చాలా చిన్నవని, దీనికి ఇంత హైప్ అవసరం లేదన్నారు. తాను ఎన్నో సార్లు ఓటు వేశానని, కానీ ఇంత హడావిడి ఎప్పుడూ చూడలేదని, ఇంత హడావిడి అవసరమే లేదని స్పష్టం చేశారు. వ్యక్తులు చేసే పనులను సినీ రంగానికి అంటగట్టవద్దని కోరారు. ఎవరు గెలిచినా సినీ నటుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అన్నయ్య, మోహన్‌బాబు మంచి స్నేహితులని మరోమారు స్పష్టం చేశారు.
అయితే ఓటు వేసేందుకు వచ్చిన పవన్ కాసేపు మంచు మనోజ్‌తో సరదాగా నవ్వుతూ కనిపించారు. మరోవైపు ఇరు ప్యానెల్స్‌కు చెందిన సభ్యులు కూడా ఆత్మీయంగా పలకరించుకుంటూ కనిపించారు. దీన్ని బట్టి చూస్తే వారు ఇన్ని రోజులూ చేసుకున్న ఆరోపణలు అబద్ధమా.. లేక కడుపుతో కత్తులు పెట్టుకుని పైకి అలా నవ్వుతూ కనిపిస్తున్నారా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా.. ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోతే మాత్రం అది ఎవరికీ క్షేమకరం కాదు. ఎవరు గెలిచినా సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేయాలి. అదే సినీ ఇండస్ట్రీ అంతా కోరుకునేది. మరి గెలిచే వారు అది సాధిస్తారా, లేదా..? అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…