Maa : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు ఇరు ప్యానెల్స్ కు చెందిన సభ్యులు.. అందరం ఒకటే అన్నారు. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. స్పోర్టివ్‌గా తీసుకుంటామని.. అందరమూ కలసి పనిచేస్తామని చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ఆ మాటలను పక్కన పెట్టేశారు. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలను నూరుతున్నారు.
ముఖ్యంగా ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టాక.. నరేష్ వారిని ఉద్దేశించి ముండమోపి ఏడుపులు.. అని దారుణంగా కామెంట్లు చేశారు. దీంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు అయింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో నటీనటుల భవిష్యత్తుపై సందేహాలు వస్తున్నాయి.
ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఎక్కువ సినిమాలు తీస్తూ ఉంటుంది. అందువల్ల వారి మూవీల్లో చాలా మందికి అవకాశాలు వస్తుంటాయి. మోహన్ బాబు కుటుంబం కూడా సినిమాలు తీస్తుంటుంది. కానీ వారి మూవీలు చాలా తక్కువగా వస్తుంటాయి. అయితే ‘మా’ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంచు విష్ణు ప్యానెల్‌లో ఉన్న నటీనటులకు ఇకపై సినిమాల్లో అవకాశాలు ఇచ్చే అంశాన్ని ప్రస్తుతం మెగా ఫ్యామిలీ పరిశీలిస్తున్నదట.
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తీవ్రంగా హర్ట్ అయిన చిరంజీవి, ఆయన సోదరులు, ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు.. మంచు విష్ణు ప్యానెల్ నటీనటులను బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశాలు లేకపోలేదు.. అని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే విష్ణు ప్యానెల్‌లో పోటీ చేసిన వారితోపాటు వారికి మద్దతుగా నిలిచిన నటులకు కూడా ఇకపై మెగా ఫ్యామిలీ సినిమాల్లో అవకాశాలు పూర్తిగా ఉండకపోవచ్చని అంటున్నారు.
అయితే ముందు ముందు ఇరు ప్యానెల్స్ మధ్య రాజీ కుదిరి అందరూ ‘మా’ బాగు కోసం, నటీనటుల సంక్షేమం కోసం పనిచేస్తే.. ఎప్పటిలా అందరికీ అవకాశాలు వస్తాయి. కానీ ఈ వివాదం ఇంతటితో ఆగకుండా.. ఒకరిపై ఒకరు ఇలాగే దూషణలు, ఆరోపణలు చేస్తూ వెళితే.. పైన చెప్పినట్లుగా మెగా ఫ్యామిలీ సినిమాల్లో మంచు ప్యానెల్ సభ్యులకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం ఖాయం అవుతుంది. మరి ఈ వివాదం ముగుస్తుందా.. లేదా.. అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…