LPG Gas Cylinder Price : దీపావళి పండుగ సందర్భంగా గ్యాస్ వినియోగదారులకు షాక్ లాంటి వార్త. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.265 మేర పెంచారు. అయితే ఇది వాణిజ్య పరంగా వాడే సిలిండర్‌కు మాత్రమే. గృహావసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ ధరను పెంచలేదు. దీంతో గృహ వినియోగదారులకు ఊరట కలిగింది. అయినప్పటికీ వాణిజ్య పరంగా వాడే గ్యాస్ సిలిండర్ ధర అంత మేర పెరగడం షాక్‌నిస్తోంది.
కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.265 పెరగడంతో.. ఢిల్లీలో ఆ సిలిండర్ ఒకదాని ధర రూ.2000.50గా ఉంది. ముంబైలో రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో రూ.2133గా ఉంది.
ఇక గృహావసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్ ధరను పెంచలేదు. దీంతో పాత ధరనే అమలుకానుంది. చివరిసారిగా ఈ సిలిండర్ ధరను అక్టోబర్ 6న రూ.15 మేర పెంచారు. దీంతో ప్రస్తుతం అవే ధరలు కొనసాగుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర ఒకదానికి గురుగ్రామ్‌లో రూ.893.50 ఉండగా, నోయిడాలో రూ.882.50, హైదరాబాద్‌లో రూ.937, లక్నోలో రూ.922.50, జైపూర్‌లో రూ.888.50గా ఉంది. అయితే రానున్న 4,5 రోజుల్లో గృహావసరాలకు వాడే సిలిండర్ ధరలు కూడా పెరుగుతాయని తెలుస్తోంది.