OTT : కరోనా విజృంభించినప్పటి నుండి ఓటీటీలకి డిమాండ్ ఏర్పడింది. సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అయినా కూడా కొద్ది రోజులకే ఓటీటీలలో వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ లాంటి ప్రముఖ ఓటీటీల్లో ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

ఈటీ.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఈటీ. ఎవరికీ తలవంచడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, పాండిరాజ్ డైరెక్షన్ లో ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను దక్కించుకుంది. ఈ మూవీ ఏప్రిల్ 7 న సన్ నెక్ట్స్, నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
స్టాండప్ రాహుల్.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని సందడి చేసిన స్టాండప్ రాహుల్ సినిమా అతి త్వరలోనే ఓటీటీలోకి రానుంది. రాజ్ తరుణ్ నటించిన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో హిట్ ను దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ అయిన మూడు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఆహా ఓటీటీలో ఏప్రిల్ 8న స్టాండప్ రాహుల్ స్ట్రీమింగ్ కానుంది.
తానక్కరన్.. కోలీవుడ్ హీరో విక్రమ్ ప్రభు నటించిన సినిమా తానక్కరన్. ఈ మూవీని తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 8 నుండి డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పోలీస్ అధికారుల ట్రైనింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
నరధాన్.. టోవినో థామస్ నటించిన మలయాళ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో టోవినో థామస్ జర్నలిస్ట్ పాత్రను పోషించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 8వ తేదీన స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
ది కింగ్స్‌మన్.. ది కింగ్స్ మన్ ఫ్రాంచైజీ నుండి వచ్చిన మూడవ సినిమా ఇది. ది కింగ్స్ మ్యాన్ అనే పేరుతో ఉన్న కామిక్ పుస్తకం నుండి ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 8న ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.