కరోనా కాలంలో ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడడంతో ప్రస్తుతం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాల కంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి. అంతే కాకుండా సగటు ప్రేక్షకుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. ప్రపంచ సినిమాలన్నింటినీ భాషతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. అదీకాక థియేటర్ లో విడుదలైన సినిమాలు నెలా, రెండు నెలలు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు థియేటర్లకు వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకని నార్మల్ ఆడియెన్స్, ఫ్యామిలీ ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దీంతో ఇప్పుడున్న ప్రముఖ ఓటీటీలతోపాటు కొత్త ఓటీటీలు సైతం పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, వూట్ లాంటి ఓటీటీలు థియేట్రికల్ రిలీజ్ అయిపోయిన సినిమాలను లేదా నేరుగా స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్న సినిమాల హక్కులను దక్కించుకునేందుకు.. ప్రతివారం పోటీ పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆగస్టు రెండో వారంలో ఓటీటీ విడుదలకు దాదాపు 27 సినిమాలు సిద్ధమవుతున్నాయి.
థియేట్రికల్ రిలీజ్ (4)లతో పాటు ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు వినోదం పంచనున్నాయి. మరి ఈ వారం ఓటీటీ/థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలేంటో ఓసారి చూద్దామా..!
నెట్ ఫ్లిక్స్ (Netflix)లో ఆగస్టు 8న నరుటో: షిప్పుడెన్ (సిరీస్ 1), హ్యాపీ బర్త్ డే (తెలుగు) స్ట్రీమ్ కానున్నాయి. 9వ తేదీన ఐ జస్ట్ కిల్డ్ మై డ్యాడ్ (హాలీవుడ్), 10న ఇండియన్ మ్యాచ్ మేకింగ్ (సిరీస్ – సీజన్ 2), లాకీ అండ్ కీ (సిరీస్ 3), బ్యాంక్ రాబర్స్: ది లాస్ట్ గ్రేట్ హెయిస్ట్, 11న దోతా: డ్రాగన్స్ బ్లడ్: బుక్ 3 (హాలీవుడ్), 12న నెవర్ హావ్ ఐ ఎవర్ (సిరీస్ – సీజన్ 3), 13న బ్రూక్లిన్ నైన్ – నైన్: సీజన్ 8 (సిరీస్), 14న గాడ్జిల్లా vs కాంగ్ (హాలీవుడ్) తదితర సిరీస్‌లు, సినిమాలు స్ట్రీమ్ కానున్నాయి.
ఇక అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో ఆగస్టు 10వ తేదీన సోనిక్ ది ఎడ్జ్ హాగ్ (హాలీవుడ్), ది లాస్ట్ సిటీ (హాలీవుడ్), 11న మలయాన్ కుంజు (మలయాళం), 12న ఎ లీగ్ ఆఫ్ దెయిర్ ఓన్ (హాలీవుడ్), కాస్మిక్ లవ్ (హాలీవుడ్), థ్యాంక్ యూ (తెలుగు) చిత్రాలు విడుదల కానున్నాయి.
అలాగే జీ5 (Zee5) లో ఆగస్టు 11న, రాష్ట్ర కవచ ఓం (హిందీ), బ్యూటిఫుల్ బిల్లో (పంజాబీ), విండో సీట్ (కన్నడ), 12న హలో వరల్డ్ (వెబ్ సిరీస్), శ్రీమతి (బెంగాలీ) చిత్రాలు స్ట్రీమ్ కానున్నాయి. ఆహా (Aha)లో ఆగస్టు 12న మాలిక్, మహా మనిషి, ఏజెంట్ ఆనంద్ సంతోష్ – 4 (వెబ్ సిరీస్) స్ట్రీమ్ కానున్నాయి. సోనీ లివ్ (Sony LIV) యాప్‌లో ఆగష్టు 12న గార్గి (తెలుగు) స్ట్రీమ్ కానుంది.
ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Hotstar)లో ఆగస్టు 11న ది వారియర్ (తెలుగు/తమిళం), 12న క్యాడవర్ (తెలుగు/తమిళం/కన్నడ/మలయాళం) మూవీలు స్ట్రీమ్ కానున్నాయి.
కాగా ఈ వారం థియేటర్లలోనూ పలు మూవీలు రిలీజ్ కానున్నాయి. ఆగస్టు 11న లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ (హిందీ) మూవీలు రిలీజ్ కానుండగా.. ఆగస్టు 12న మాచర్ల నియోజకవర్గం, 13న కార్తికేయ 2 చిత్రాలు రిలీజ్ కానున్నాయి.
ఈ విధంగా మూవీ లవర్స్ కి, ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పూర్తిస్థాయిలో వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నాయి వెబ్ సిరీస్ లు/సినిమాలు. ఒకే వారంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అవడం ఇదే మొదటిసారి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…