మీనా అంటే సినిమాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 1990లో తెలుగులో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ . తమిళనాడులో పుట్టినప్పటికీ తెలుగు సినిమాల ద్వారానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నటించింది. ఇప్పటికీ ఎన్నో మంచి చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా తరచూ పోస్టులు పెడుతూ యాక్టివ్ గా ఉంటుంది.
ఇదిలా ఉండగా ఈ మధ్య మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం ఆమెని తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో ఆయన ఇటీవల మరణించారు. ఈ విషయంలో తన బంధువులు, స్నేహితులు తనకి అండగా నిలిచారు. ఈ క్రమంలో తను సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వస్తోంది. భర్త చనిపోయిన దగ్గరి నుండి ఇన్ స్టాగ్రామ్ లో కేవలం 3 పోస్టులే పెట్టింది.
అయితే లేటెస్ట్ గా మీనా తన మిత్రురాళ్లయిన నాటి తరం హీరోయిన్లు సంఘవి, సంగీత, రంభ తదితరులతో దిగిన ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. వీరంతా తమ తమ కుటుంబాలతో కలిసి వెళ్లి మీనాను పరామర్శించారు. భర్త పోయిన దుఃఖంలో ఉన్న ఆమెకు వారు ఓదార్పును ఇచ్చారు. ఈ క్రమంలోనే తీసిన ఫొటోను మీనా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. మీనా ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఇటీవలే తేరుకున్న ఆమె సినిమా షూటింగ్‌లలోనూ పాల్గొంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…