Liger Radhe Shyam : ఏంటి విజయ్.. ఆగస్టు 25న ఇండియా మొత్తం షేక్ అవుతుంది అన్నావ్.. సినిమా చూసిన వాళ్లకి మైండ్ బ్లాక్ అవుతుంది అన్నావ్.. చూడడానికి ఏముంది అక్కడ, మీ మాటల్లో ఉన్న క్రేజ్ సినిమాల్లో లేదు.. అంటూ థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు సినిమాని చెత్త చెత్త చేశారు అంటూ తిట్టుకుంటూ బయటకు వస్తున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా ఎలాంటి చెత్త టాక్ ను సొంతం చేసుకుందో వేరే చెప్పనవసరం లేదు. నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా పూరీని, విజయ్ ని సెటైర్లతో ఏకిపారేస్తున్నారు.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి జంటగా నటించిన లైగర్ చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయి ఫస్ట్ షోకే అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. మైక్ టైసన్ వంటి గొప్ప ప్రముఖుడు చిత్రంలో నటించినప్పుడు సినిమా ఏ రేంజ్ లో ఉండాలి. కథలో కంటెంట్, డైరెక్షన్ పూర్ గా ఉండడం, పూరీ జగన్నాథ్ రేంజ్ సినిమా కాకపోవడంతో అభిమానులకు భారీ స్థాయిలో నిరాశ మిగిలింది. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళేది విజయ్ దేవరకొండ డైలాగ్స్ కోసమే. విజయ్ నటన పరంగా మెప్పించినా నత్తి సుత్తి అంటూ విజయ్ దేవరకొండలో ఉండే రియల్ టాలెంట్ ని చంపేసి సినిమాను చెత్త చెత్త చేశాడు పూరీ.. అంటూ కామెంట్స్ వినబడుతున్నాయి.
టాప్ హీరోని కాస్తా ఫ్లాప్ హీరోని చేశావంటూ పూరీపై సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే లైగర్ చిత్రంలో మరో మిస్టేక్ కూడా ఉంది. అచ్చు పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన రాధే శ్యామ్ సినిమా కోసం ఏదైతే తప్పు చేశాడో, ఇప్పుడు విజయ్ దేవరకొండ అదే తప్పు చేశాడు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడున్న మన టాలీవుడ్ హీరోలు టాలీవుడ్ కంటే ఎక్కువ బాలీవుడ్ పైనే మక్కువ చూపిస్తున్నారు. మన తెలుగు జనాలు ఒక సినిమా ఎలా ఉండాలని కోరుకుంటారో అనే విషయాన్ని మరిచిపోతున్నారు హీరోలు. పాన్ ఇండియా క్రేజ్ లో పడి బాలీవుడ్ హంగులు అద్దుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ ఉండే హీరో అంటే ప్రభాస్ అని వినిపిస్తుంది.
ఆయన రాధే శ్యామ్ సినిమాను తెలుగు ప్రేక్షకుల రేంజ్ లో కాకుండా బాలీవుడ్ స్థాయిలో తీసి సినిమాకి లేనిపోని హంగూ ఆర్భాటాలు చేసి చివరకు అట్టర్ ఫ్లాప్ టాక్ ను దక్కించుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమాకి అదే తప్పు చేశాడు అంటూ జనాలు చెప్తున్నారు. తెలుగు రేంజ్ ని ఊహించుకోకుండా ప్రతి ప్రమోషన్స్ లో బాలీవుడ్ కి పెద్దపీట వేస్తూ విజయ్ చూపించిన యాటిట్యూడ్, పొగరుగా మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన కెరీర్ ని నాశనం చేసే స్థాయికి తెచ్చుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిత్రం విడుదల కాకముందు నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తూ ఉంటే చివరకు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. ఇకనైనా హీరోలు ఇలాంటి తప్పులు చేయకపోతే సినిమాలు కనీసం తెలుగులోనైనా నిలుస్తాయి. లేదంటే కెరీర్ మొత్తం నాశనం అవడం ఖాయం.