Liger Movie Review : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన మూవీ లైగర్. ఈ మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ చిత్రాలు తీసిన దర్శకుడిగా పూరీకి మంచి పేరుంది. అలాగే విజయ్ కూడా యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నాడు. మరో వైపు పాన్ ఇండియా మూవీ అనేసరికి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే విజయ్, పూరీలు ఈ అంచనాలను అందుకునేలా చేశారా.. సినిమా ఎలా ఉంది.. అసలు కథ ఏమిటి.. ఇది ప్రేక్షకులను అలరించిందా.. లేదా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
బాలమణి (రమ్యకృష్ణ), ఆమె కుమారుడు లైగర్ (విజయ్ దేవరకొండ) కరీంనగర్‌లో ఉంటారు. తన కొడుకు ఫైటర్ కావాలని అనుకుంటాడు. దీంతో బాలమణి.. లైగర్‌ను ముంబైకి తీసుకువస్తుంది. అక్కడ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్‌గా లైగర్ శిక్షణ తీసుకుంటుంటాడు. ఈ క్రమంలోనే అమ్మాయిలకు దూరంగా ఉండాలని.. వారితో లవ్‌లో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని బాలమణి తన కొడుక్కి చెబుతుంది. అయినప్పటికీ లైగర్ ముంబైలో తాన్య (అనన్య పాండే) అనే అమ్మాయితో లవ్‌లో పడతాడు. అయితే చివరకు ఏమవుతుంది ? నేషనల్ చాంపియన్‌గా ఉన్న లైగర్ అంతర్జాతీయ చాంపియన్ అవుతాడా ? అసలు వీరికి మైక్ టైసన్‌తో ఏం సంబంధం ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అద్భుతమనే చెప్పాలి. లైగర్ పాత్రను దర్శకుడు పూరీ తీర్చిదిద్దిన తీరు బాగానే ఉంటుంది. కానీ సినిమాలో విజయ్ చెప్పే డైలాగ్స్ కే బాగా విసుగు వస్తుంది. ఇక ఎంతో గ్లామరస్‌గా కనిపించిన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే డైలాగ్స్ కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. కాగా సినిమాలో కొన్ని చోట్ల డైలాగ్స్ పేలినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే చాలా వరకు డైలాగ్స్ విసుగు తెప్పించేవిగా ఉంటాయి. ఇక కథ ఉన్నపళంగా అమెరికాకు మారుతుంది. ఈ మూవీలో టైసన్ పాత్ర అనవసరం అనిపిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా కనుక హీరో గోల్ ఏంటో ముందే చెప్పేస్తారు. కనుక ఇలాంటి కథలను డీల్ చేయాలంటే.. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చూడాలి.
కథను ముందే ఎవరైనా ఊహిస్తారు. కనుక సినిమా చివరన హీరో గోల్ సాధించేవరకు కథను ఆకట్టుకునే విధంగా నడిపించాలి. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, భద్రాచలం వంటి సినిమాల్లో కథ చాలా ఆసక్తిగా సాగుతుంది. కానీ లైగర్‌లో అంత ఆసక్తిగా ఉండదు. తరువాత ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. కనుక ప్రేక్షకులకు పెద్దగా థ్రిల్ అనిపించదు. రొటీన్ స్టోరీనే అన్న భావన కలుగుతుంది.
ఇక మూవీలో మిగిలిన పాత్రల్లో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, గెటప్ శ్రీను వంటి వారు ఫర్వాలేదనిపించారు. తమ పాత్రలకు న్యాయం చేశారు. కానీ టైసన్ పాత్ర పెద్దగా ఆకట్టుకోదు. అందువల్ల చిత్ర యూనిట్ టైసన్ విషయంలో చేసిన ప్రయోగం విఫలం అయిందనే చెప్పాలి. ఇక సంగీతం, సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఫస్టాఫ్‌లో విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంటుంది. కానీ సెకండాఫ్‌లో అసలు నచ్చదు. అలాగే కథను ఇంకా మారిస్తే బాగుండని అనిపిస్తుంది. చివరి 40 నిమిషాలు అసలు సినిమాలో ఏమీ ఉండదు. ముందే ఊహించేస్తారు. ఇక మొత్తంగా చెప్పాలంటే.. లైగర్ మూవీ ప్రేక్షకులను నిరాశ పరుస్తుందని చెప్పవచ్చు. అంత ఓపిక ఉంటే ఒకసారి చూడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…