Ram Gopal Varma : ఆర్ఆర్ఆర్ సినిమా ఒక స‌ర్క‌స్.. వివాదాస్ప‌దం అవుతున్న రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్..

Ram Gopal Varma : రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ వివాదాల ద్వారానే ప‌బ్లిసిటీ కోరుకునే వ్య‌క్తి. త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను నిర్మొహ‌మాటంగా బ‌య‌ట పెట్టేస్తూ ఉంటాడు. అవి కాస్తా వివాదాల‌ను సృష్టిస్తూ ఉంటాయి. దీంతో అత‌ను అంద‌రి దృష్టిలో ప‌డుతూ ఉంటాడు. ఒక ర‌కంగా త‌న‌కు కావ‌ల్సింది కూడా అదే అని చెప్తూ ఉంటాడు. అందుకే వివిధ సంద‌ర్భాల్లో అలాంటి వాఖ్య‌లు చేస్తూ ఉంటాడు. అయితే ఆయ‌న ఇదివ‌ర‌కే అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాని గే స్టోరీ గా అభివ‌ర్ణించార‌ని కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయ‌న ఆర్ఆర్ఆర్ సినిమాను స‌ర్క‌స్ లా ఉంద‌ని అన్నాడు.

ఆర్జీవీ తాజాగా ఒక యూట్యూబ్ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ.. త‌న‌కి ఆర్ఆర్ఆర్ సినిమాను చూస్తుంటే స‌ర్క‌స్ చూసిన‌ట్టుగా అనిపించింద‌ని అన్నారు. ఇంకా త‌న‌కు ఎవ‌రినీ కించ ప‌రిచే ఉద్దేశం లేద‌ని, త‌నని త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్ద‌ని చెప్పడం జ‌రిగింది. అయితే తాను ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసిన‌ప్పుడు గొప్ప అనుభూతికి లోన‌య్యాన‌ని, ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు చిన్న బాలున్ని కాపాడే స‌న్నివేశం బాగుంటుంద‌ని అన్నారు. అంతే కాకుండా వారిద్ద‌రూ ఆ సీన్ లో జెమినీ స‌ర్క‌స్ లో ఉండే ప్రొపెష‌న‌ల్ జిమ్నాస్టిక్ చేసేవాళ్లలా అనిపించార‌ని త‌న అభిప్రాయాన్ని వివ‌రించారు.

Ram Gopal Varma

ఇదే సంద‌ర్భం లో రామ్ గోపాల్ వ‌ర్మ తాను మ‌ణిర‌త్నంతో క‌లిసి ప‌ని చేసిన రోజులను కూడా గుర్తు చేసుకున్నారు. ఆర్జీవీ మాట్లాడుతూ.. త‌ను చేసే ప‌నులు మ‌ణిర‌త్నంకి న‌చ్చ‌వ‌ని, అలాగే మ‌ణిర‌త్నం చేసే ప‌నులు కూడా త‌నకు న‌చ్చ‌వ‌ని పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ తామిద్ద‌రం క‌లిసి దొంగ దొంగ ఇంకా గాయం సినిమాలు చేయ‌డం జ‌రిగింద‌ని, ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ భేదాలు ఉండేవ‌ని అన్నారు. ఇంకా త‌న కెరీర్ లో క్ష‌ణ‌క్ష‌ణం, స‌ర్కార్ సినిమాల‌ను మాత్ర‌మే ముందుగా అనుకున్న హీరోతో అలాగే ప‌క్కా క‌థ‌, స్క్రీన్ ప్లేల‌ తో తీశాన‌నీ, కానీ మిగిలిన సినిమాల‌న్నీ అలా జ‌ర‌గ‌లేద‌ని వివ‌రించారు.

Share
Prathap

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM