Laya : ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన లయ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే సందడి మాములుగా లేదు. ఇటీవల కూతురు శ్లోకాతో కలిసి డ్యాన్స్ స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న శ్లోకా.. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇక లయ కూడా తన పర్‌ఫార్మెన్స్ తో అదరగొడుతోంది.

తాజాగా నటి లయ డీజే టిల్లు మూవీ లోని సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులేసింది. లయ పర్‌ఫార్మెన్స్‌కి కుర్రకారు మంత్ర ముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం లయ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. త్వరలోనే హీరోయిన్ గానూ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె టాలీవుడ్‌లో టాప్ హీరోలందరిలోనూ కలిసి నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపుగా 60 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకొని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్‌లో స్థిరపడింది.
View this post on Instagram
ఒకప్పుడు తెలుగులో ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో లయ కూడా ఒకరు. స్టార్ హీరోలతో నటించకపోయినా.. లయ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించేవి. అలాగే తన నటన కూడా అందరు మెచ్చేలా ఉండేది. 2005లో విడుదలయిన అదిరిందయ్యా చంద్రం హీరోయిన్‌గా లయ చివరి చిత్రం. ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళంలోనే బిజీ అయిపోయారు లయ. రవితేజ హీరోగా, శ్రీను వైట్ల తెరకెక్కించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో మరోసారి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది లయ. కానీ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే చాలామంది ప్రేక్షకులకు లయ రీఎంట్రీ గురించి కూడా తెలీదు. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న లయ.. వైరల్ అయిన కచ్చా బాదం పాటకు స్టెప్పులేసింది. ఇది ఫుల్ వైరల్ అయింది.