Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్న సంగతి తెలిసిందే. ఆయన పెళ్లికి సంబంధించి అప్పుడప్పుడు పలు వార్తలు హల్ చల్ చేస్తూనే ఉంటాయి. అయితే మెగా హీరో వరుణ్ తేజ్, టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి లవ్ ట్రాక్ రూమర్స్ గురించి అందరికీకి తెలిసిందే. ఆ మధ్య ఈ హీరోయిన్ క్లారిటీతో ఈ పేజ్ ముగిసిపోయింది అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మరోసారి వరుణ్ తేజ్ – లావణ్య లవ్ ట్రాక్ అంటూ సోషల్ మీడియాలో మళ్లీ ప్రచారం స్టార్ట్ అయ్యింది.

మొన్నామధ్య లావణ్య త్రిపాఠి బర్త్ డే జరిగినప్పుడు వరుణ్ రూ.1 కోటి డైమండ్ రింగ్‌తో బెంగళూరు వెళ్లి మరీ శ్‌లోశ్లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న ఫొటో షేర్ చేసి ఈ వార్తలకు చెక్ పెట్టేసింది. ఇక అప్పటి నుండి వీరిద్దరికీ సంబంధించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. తాజాగా లావణ్య చేసిన ఓ ట్వీట్‌తో ఈ విషయం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ హీరో, హీరోయిన్లుగా నటించిన గని చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. సినిమా రిలీజ్ డేట్ నేపథ్యంలో గని టీమ్‌కు లావణ్య స్పెషల్ విషెస్ చెప్పింది. వరుణ్.. ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావని తెలుసు. నీతో పాటు నీ టీమ్ చేసిన హార్డ్ వర్క్‌కి తగిన ప్రతిఫలం దక్కాలని ప్రార్థిస్తున్నా.. అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
లావణ్య త్రిపాఠి చేసిన ఈ ట్వీట్‌తో అందరిలోనూ సరికొత్త అనుమానాలు నెలకొన్నాయి. అమ్మడి ట్వీట్‌తో వీరిద్దరి ప్రేమాయణం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఇక గని సినిమా విషయానికి వస్తే అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తొలిసారి బాక్సర్‌గా కనిపించాడు వరుణ్. తమన్ బాణీలు కట్టారు.