Rana : సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి సరికొత్త అప్‌డేట్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా తెలియజేసింది.
ఇకపోతే డానియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్న రానా సరసన నటించడం కోసం ముందుగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని, కొంత చిత్రీకరణ కూడా చేసిన తర్వాత ఈ సినిమా నుంచి ఐశ్వర్య రాజేష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉన్న ఫలంగా ఆమె సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం.. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోవడం చేత ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే చిత్రబృందం రానా సరసన నటించడం కోసం మరో హీరోయిన్ వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే రానా సరసన మలయాళం స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటించబోతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా తెలియజేసింది.