Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా అందాల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఏళ్ల తరబడి పరిశ్రమలో తిరుగులేకుండా ప్రస్థానం సాగించిన భామలలో తమన్నా కూడా ఒకరు. తెలుగుతోపాటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో కూడా నటిస్తూ దూసుకెళ్తోంది. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించింది.

చక్కని నటన, అంతకు మించిన గ్లామర్.. ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. 2019లో విడుదలైన ఎఫ్ 2 చిత్రంలో తమన్నా, మెహ్రీన్ సెమీ బికినీలు వేసి షాక్ ఇచ్చారు. బికినీలలో పక్కపక్కనే ఇద్దరూ నడిచి వస్తుంటే, తమన్నా గ్లామర్ ముందు, మెహ్రీన్ పూర్తిగా డామినేట్ అయింది. సిమ్లా యాపిల్ లా ఉండే మెహ్రీన్ కూడా తమన్నా గ్లామర్ ముందు నిలబడలేకపోయింది. ఇక కెరీర్ బిగినింగ్ లో పద్ధతిగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసిన తమన్నా… స్టార్ హీరోల చిత్రాలలో గ్లామర్ రోల్స్ చేసింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ కి చిరంజీవి జోడీగా భోళా శంకర్ చిత్రంలో తమన్నా నటిస్తోంది.
గత కొంత కాలంగా తమన్నా తన అందచందాలతో మంత్ర ముగ్ధులని చేస్తోంది. తన అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పోగోడుతోంది. ఆ మధ్య తమన్నా మాల్దీవులకి వెళ్లగా, పింక్ బికినీలో మాల్దీవ్ లలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి. తాజాగా డాన్స్ రిహార్సల్ కి వచ్చిన తమన్నా కెమెరా కంట పడింది. దీంతో టీ షర్టు పైకెత్తి నాభి అందాలను చూపెడుతున్న తమన్నా ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇవి చూసిన ఆమె అభిమానులు మైమరచిపోతున్నారు.