Lasya : ప్రముఖ యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చీమ, ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపులర్.. యాంకర్‌గా స్టేజీపై ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె, కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. కెరీర్ లో కాస్త వెనకబడుతున్నానని అనుకున్న సమయంలో మంజునాథ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సొంత యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.
అయితే తాజాగా లాస్య మళ్లీ ఓ బిడ్డకు తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. భర్త మంజునాథ్ తో ఫొటోలకు ఫోజులిచ్చిన లాస్య తన మెడికల్ రిపోర్ట్స్ చూపించింది. కొన్నాళ్ల క్రితం మంజునాథ్ అనే వ్యక్తిని లాస్య ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహాన్ని ఆమె పేరెంట్స్ ఒప్పుకోలేదు. దీంతో చాలాకాలం ఆమె తల్లిదండ్రులకు దూరంగా భర్తతో జీవించింది. అయితే లాస్య తల్లి అయ్యాక తల్లిదండ్రులు దగ్గరకు తీశారు. లాస్యకు మొదటి సంతానంగా అబ్బాయి పుట్టాడు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత లాస్య మళ్ళీ గర్భం దాల్చింది.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో తెలియజేసింది. ఇక లాస్య తల్లి అయిందని తెలుసుకున్న సన్నిహితులు, అభిమానులు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల లాస్య అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో పేషేంట్ గా బెడ్ పై ఉన్న లాస్య ఫోటోను మంజునాథ్ షేర్ చేశాడు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని వేడుకున్నాడు. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. బాగా జ్వరంతో ఆసుపత్రిలో చేరిన లాస్య తిరిగి కోలుకుంది.