Kushboo : తమిళ సినీ ఇండస్ట్రీలో అందానికే మారు పేరుగా ఉండే ఖుష్బూ లేటెస్ట్ ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆమె అందానికి, నటనకు ప్రతి రూపంగా ఆమెకు గుడి కూడా కట్టారు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రల్లో నటిస్తోంది. 50 ఏళ్ళ వయస్సులోనూ తన అందంతో మ్యాజిక్ చేస్తోంది.
అందుకు నిదర్శనం లేటెస్ట్ ఫోటోలే. లేటెస్ట్ గా 15 కిలోలు బరువు తగ్గి తన ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బరువు తగ్గేందుకు చాలామంది వ్యాయామం, యోగాలపై ఆధారపడితే.. మరికొంతమంది సర్జరీలతో కంట్రోల్ చేసుకుంటున్నారు.
ఖుష్బూని ఇంత సన్నగా చూసిన ప్రతిఒక్కరూ వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. 1980ల్లోనే బాలీవుడ్ లోకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ.. టాలీవుడ్ లో కలియుగ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రజంట్ ఆమె పాలిటిక్స్ లో చక్రం తిప్పుతూనే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తోంది.
కరోనా లాక్ డౌన్ టైమ్ లో సొంతంగా ఇంటి పనులు చేసుకున్నానని.. డైట్ ని కూడా పర్ఫెక్ట్ గా పాటిస్తూ.. ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఖుష్బూ, రజనీకాంత్ హీరోగా వస్తున్న తమిళ సినిమా అన్నాతేలో యాక్ట్ చేస్తున్నారు. అలాగే తెలుగులో శర్వానంద్ హీరోగా వస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలోనూ నటిస్తున్నారు.