Krithi Shetty : ఉప్పెన సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ కృతి శెట్టి బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఈమె గతేడాది నుంచి చేస్తున్న సినిమాలు అన్నీ హిట్ అవుతున్నాయి. ఈ మధ్యే వచ్చిన బంగార్రాజు సినిమాతోపాటు అంతకు ముందు వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. దీంతో కృతిశెట్టికి ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ఇక తాజాగా చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. కృతిశెట్టికి బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.
తెలుగులో శ్యామ్ సింగరాయ్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో నానితోపాటు కృతి శెట్టి, సాయిపల్లవిలు నటించారు. అయితే ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేయాలని చూస్తున్నాడట. ఆ సినిమాలో కృతి శెట్టిని తిరిగి అదే రోల్ కోసం అడిగారట. దీంతో ఈమె ఓకే చెప్పిందని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఇక కృతి శెట్టి పలు సినిమాలతో బిజీగా ఉంది. రామ్ పక్కన ది వారియర్ అనే చిత్రంలో కృతి నటిస్తోంది. అలాగే నితిన్‌తో కలిసి మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేస్తోంది. దీంతోపాటు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీలోనూ కృతి శెట్టి నటిస్తోంది. ఈ క్రమంలో వరుస సినిమాలతో ఈమె ఇప్పుడు ఎంతో బిజీగా ఉందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…