Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటుడిగా, నిర్మాతగా పేరు సంపాదించుకొని ప్రస్తుతం బుల్లితెర పై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నాగబాబు పలు అంశాలపై స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నాగబాబు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నాగబాబు సరదాగా అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ నుంచి నాగబాబుకు నిహారిక వైవాహిక జీవితం గురించి ప్రశ్న ఎదురైంది. నాగబాబు అంకుల్ నిహారిక అక్క ఒక్కసారిగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. ఏమైంది తన గురించి వచ్చే రూమర్లపై స్పందించండి అంటూ ప్రశ్నించారు. ఈ విధంగా నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా నాగబాబు సమాధానం చెబుతూ తన గురించి ఇలాంటి రూమర్స్ రావడానికి కారణం తానే అని వెల్లడించారు. తానే కోడింగ్ నేర్చుకొని నిహారిక అకౌంట్ హ్యాక్ చేశానని, డీ కోడ్ నేర్చుకోగానే రీ యాక్టివేట్ చేస్తాను అంటూ బ్రహ్మానందం ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం నాగబాబు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా నిహారిక వైవాహిక జీవితం గురించి మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు చైతన్య చెక్ పెడుతూ వారిద్దరూ ఎంతో చనువుగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఈ క్రమంలోనే నాగబాబు ఇలా కామెంట్స్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…