Krithi Shetty : యంగ్ హీరో రామ్, బేబమ్మ కృతిశెట్టి కలసి నటించిన ది వారియర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దీనికి లింగు స్వామి దర్శకుడు. ఈ మూవీ మధ్యే థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమాకు బిలో యావరేజ్ టాక్ వస్తోంది. పైగా వర్షాలు కూడా భారీగా పడుతుండడంతో అది ఈ సినిమాపై ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలోనే సినిమా రెండో రోజే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో మూవీ డిజాస్టర్ అవుతుందేమోనని అంటున్నారు.
ది వారియర్ మూవీలో మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ఫైట్స్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. అయినప్పటికీ థియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం లేదు. ఇక సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ ఏదో మిస్ అయిందనే భావన ప్రేక్షకుల్లో కలుగుతోంది. రొటీన్ స్టోరీ అని ఫీలవుతున్నారు. కొన్ని చోట్ల సినిమాకు నెగెటివ్ టాక్ కూడా ఎక్కువైపోయింది. అయితే తాజాగా ఈ మూవీలో కృతి శెట్టి సీన్లపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. నెటిజన్లు ఆమెను, దర్శకున్ని బాగానే ట్రోల్ చేస్తున్నారు.

ఇందులో కృతి శెట్టి నటిస్తుందనగానే ఆమె కోసం అయినా ప్రేక్షకులు వస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. అయితే ఇందులో కృతిశెట్టిని మరింత అందంగా చూపించడంలో దర్శకుడు లింగుస్వామి ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. ఈమెను గ్లామర్‌గా చూపించలేదనే అంటున్నారు. అలాగే కృతిశెట్టిపై క్లోజప్ షాట్స్ ఎక్కువగా పడ్డాయంటున్నారు. ఆమెను అంతలా చూపించాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఆమెకు వాస్తవానికి దంతాలు కాస్త ఎత్తుగా ఉంటాయి. అయితే సినిమాలో ఆమె మూతినే బాగా చూపించారని అంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే మరో 2, 3 రోజుల్లో ఈ మూవీ ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది తేలిపోనుంది. మరి ఈ మూవీ ద్వారా రామ్ హిట్ కొడతాడా.. ఫ్లాప్‌లాగే మిగిలిపోతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.