Krishna : ఒకే కథాంశంతో తెరకెక్కిన సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సినిమాలేవో తెలుసా..? రెండూ హిట్ అయ్యాయి..!

Krishna : తెలుగు సినీ పరిశ్రమలో ఒకే పేరుతో వచ్చే ఎన్నో చిత్రాలు మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు మిస్సమ్మ, దేవదాసు ఇలాంటి ఎన్నో చిత్రాలు మరోసారి అదే పేరుతో వచ్చిన చిత్రాలు కూడా చూశాం. మరి కొన్ని సినిమాలు పేర్లు వేరుగా వచ్చిన కథ మాత్రం ఎక్కడో చూసిన భావన కలుగుతుంది. పూర్తి స్థాయిలో అదేవిధంగా కథ లేకపోయినా కొంచెం పోలిక‌ అయితే మాత్రం కనిపిస్తుంది. అలా దగ్గరగా ఒకే కథతో వచ్చిన తండ్రి కొడుకుల సినిమా ఇది ఒక్కటే అని చెప్పచ్చు. ఆ చిత్రాలు ఇంకా ఎవరివో కాదు.. టాలీవుడ్ సూపర్ స్టార్స్ కృష్ణ మరియు మహేష్ బాబులవి.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం. ఈ చిత్రంలో ఊరి కోసం హీరో తన కోట్ల రూపాయల ఆస్తిని, తను ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టి దేవరకోట అనే ఊరిని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిలోఎంపీ మరియు అతని తమ్ముడు చేసే ఆకృత్యాలను  ఎదురుకొని చివరకు ఊరిని ఎలా అభివృద్ధి చేస్తాడు అనే కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు కొరటాల శివ. చివరకు శృతిహాసన్ ని పెళ్లి చేసుకుని అదే ఊర్లో ఉండిపోతాడు. ఈ చిత్ర కథాంశం కొత్తగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను సాధించింది.

Krishna

1983లో దాదాపుగా ఈ స్టోరీ కి దగ్గరలో కోదండరామిరెడ్డి దర్శకత్వం సూపర్ స్టార్ కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమారాజు అనే స్టోరీ కూడా ఇంచుమించు శ్రీమంతుడు చిత్రం మాదిరిగా ఉంటుంది అని చెప్పచ్చు. ఈ చిత్రంలో కృష్ణకి జంటగా శ్రీదేవి నటించారు. లంకా నగరం అనే గ్రామంలో రామరాజు అనే పెద్దమనిషి కార్మికులను పీడిస్తూ ఊరి పెద్దగా చలామణి అవుతూ ఉంటాడు.

అదే సమయంలో ఊరిలోకి వచ్చిన భీమారాజు హీరోయిన్ ను ప్రేమించడం జరుగుతుంది. విలన్ చేసే చెడు పనులకు భీమ‌రాజు అడ్డుపడుతూ ఉంటాడు. అయితే చివరలో భీమరాజు కోటీశ్వరుడని, కోట్ల ఆస్తిని వదులుకొని ఇక్కడకు వచ్చాడని భీమరాజు తండ్రి చెప్పడం జరుగుతుంది. చివరకు హీరో విలన్ కు సరైనా గుణపాఠం చెప్పి హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమరాజు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన  శ్రీమంతుడు  దాదాపు ఒకే విధంగా ఉండే ఈ రెండు కథలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM