Simran : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరంలేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో తన నటనకు గాను చెరగని ముద్ర వేసుకుంది. ఇక అప్పట్లో సిమ్రాన్ కు ఒక రేంజ్ లో ప్రేక్షకులలో ఫాలోయింగ్ ఉండేది. అబ్బాయిగారి పెళ్లి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సిమ్రాన్ మా నాన్నకు పెళ్లి చిత్రంలో శ్రీకాంత్ సరసన హీరోయిన్ గా నటించి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మొత్తానికి సిమ్రాన్ నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిందనే చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ సిమ్రాన్ క్రేజ్ ఏమాత్రం కూడా తగ్గలేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి అద్భుతమైన సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించి హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.
ఆ తరువాత సిమ్రాన్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడు ఊహించిన స్థాయిలో గుర్తింపు అందుకోలేకపోయింది. బాలీవుడ్ లో నటించిన సిమ్రాన్ కి ఒక సక్సెస్ కూడా దక్కలేదు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సిమ్రాన్ హీరో రజనీకాంత్ సరసన పేట చిత్రంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మాధవన్ హీరోగా నటించిన రాకెట్రీ చిత్రంలో కూడా సిమ్రాన్ నటించారు.
తాజాగా సిమ్రాన్ తన ట్విట్టర్ ద్వారా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసుకుంది. సిమ్రాన్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 46 ఏళ్ల వయసులో కూడా సిమ్రాన్ ఎంతో గ్లామర్ లుక్ తో నేటి తరం యువ హీరోయిన్ లను తలదన్నే అందంతో అందరిని ఆకట్టుకుంటుంది. 45 ప్లస్ లో కూడా సిమ్రాన్ ఇంకా 25 ఏళ్ళ అమ్మాయిలా కనిపించడానికి గల అసలు కారణం ఏమిటి అనే విషయంపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సిమ్రాన్ తమిళ్ మరియు హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…