Kota Srinivasa Rao : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు మెగా ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే ఆయన వ్యాఖ్యలకు అప్పట్లోనే నాగబాబు కౌంటర్ ఇచ్చారు. తరువాత చాలా రోజులకు కోట ఇప్పుడు మళ్లీ ఏకంగా చిరంజీవిపైనే తీవ్ర విమర్శలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిరంజీవిని తీవ్రంగా విమర్శించారు. ఇంతకీ కోట ఏమన్నారంటే..
మేడే ఉత్సవాల్లో భాగంగా చిరంజీవి పలు కీలకవ్యాఖ్యలు చేశారు. వాటిపైనే కోట స్పందించారు. చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం హాస్పిటల్ కట్టించాలనుకుంటున్నానని చిరంజీవి అన్నారు. అయితే దీనిపై కోట విమర్శలు చేశారు. ప్రస్తుతం ఎంతో మంది అవకాశాలు లేక కృష్ణానగర్‌లో ఉంటున్నారని.. చాలా మంది అవకాశాలు లేక వ్యసనాల బారిన పడుతున్నారని.. వారికి అవకాశాలు ఉంటే.. సినిమాల్లో నటిస్తూ డబ్బులు సంపాదిస్తారని.. అలాంటప్పుడు వారు అపోలో హాస్పిటల్‌కు వెళ్లాలని చూస్తారు కానీ.. కార్మికుల హాస్పిటల్‌కు ఎందుకు వెళ్తారని.. కోట ప్రశ్నించారు. కార్మికులకు కావల్సింది హాస్పిటల్ కాదని.. తిండి.. అవకాశాలు అని అన్నారు.
చిరంజీవి మేడే ఉత్సవాల్లో భాగంగా తాను కార్మికుడినని అన్నారని.. అయితే రూ.కోట్లల్లో పారితోషికం తీసుకునేవారు కార్మికుడు ఎలా అవుతాడని అన్నారు. అలాగే ఆయన సినిమాల్లో ఎవరికైనా అవకాశం ఇచ్చి ఆదుకున్నారా.. అని అడిగారు. ఇక చిరంజీవి తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పుకుంటారని.. అయితే ఏనాడైనా తన వద్దకు వచ్చే వారికి ఒక్క రూపాయి అయినా సహాయం చేశారా.. అని ప్రశ్నించారు. తన ఇంటికి వచ్చే చిన్న కార్మికులకు సైతం రూ.500 నుంచి రూ.1000 వరకు ఇస్తుంటానని.. ఇక అవసరం ఉన్నవారికి రూ.5 లక్షల వరకు కూడా తాను సహాయం చేశానని కోట అన్నారు. అలాగే తాను షుగర్ పేషెంట్ అయి ఉండి కూడా సినీ కార్మికుల కోసం గతంలో 4 రోజుల పాటు నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు.
కాగా కోట చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. ఇక చిరంజీవి ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉన్నారు. ఆయన నటించిన ఆచార్య మూవీ విడుదల అనంతరం ఆయన భార్య సురేఖతో కలిసి టూర్‌కు వెళ్లారు. ఇంకో నెల రోజుల వరకు ఆయన అక్కడే ఉండనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…