Kota Srinivas Rao : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప నటులున్నారు. వారిలో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. సెలబ్రిటీల జీవితం పూలపాన్పు కాదు. ఎంత పేరు, గౌరవం వస్తాయో అందుకు తగిన సమస్యలు కూడా ఉంటూనే ఉంటాయి. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నట్లు లేటెస్ట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తెలిపారు. ఆయన సినీ కెరీర్ ను స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. తన టాలెంట్ ని ఆసరాగా చేసుకుని వాటన్నింటిని దాటుకుని సినీ చరిత్రలోనే తిరుగులేని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ఉన్నతమైన స్థానాలలో ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోట శ్రీనివాసరావు లైఫ్ లో ఎన్నో కష్టాలు, సుఖ దుఖాలను చూశారు. 1968 లో కోటకి రుక్మిణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. విజయవాడలో కోట శ్రీనివాసరావు కూతురు, కొంతమంది బంధువులు రిక్షా ఎక్కారట. ఈ రిక్షాను ఎదురుగా వస్తున్న ఓ లారీ ఢీకొట్టింది. దాంతో కోట శ్రీనివాసరావు కూతురు యాక్సిడెంట్ లో కాలును పోగొట్టుకున్నారు.
దాంతో ఆమె భవిష్యత్ పై బెంగ పెట్టుకున్న కోటశ్రీనివాసరావు.. ఆయన గతంలో పని చేసిన బ్యాంకులో ఓ గుమస్తాగా ఉన్న వారింటికి ఆమెనే కోడలిగా పంపారట. అలా కోట కుమార్తె జీవితం ప్రశ్నార్థకంగా మారినా.. ఓ మంచి కుటుంబంలో హాయిగా ఉంది. వారికి ఇప్పుడు ఓ కూతురు కూడా కలిగి ఎంతో సంతోషంగా ఉన్నారని కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే కోట శ్రీనివాసరావు కొడుకు కూడా చనిపోవడం బాధాకరం అని అన్నారు. తనకు ఆ భగవంతుడు ఎంత పేరుని, ప్రతిష్టల్ని ఇచ్చాడో.. అంతే కష్టాలను కూడా ఇచ్చాడని బాధపడ్డారు.