Konidela Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో అంత పెద్ద యాక్టివ్‌గా ఉండడం లేదు. గతంలో తన భర్త కల్యాణ్ దేవ్‌తో కలిసి ఎక్కడికెళ్లినా.. ఏం చేసినా.. అప్‌డేట్స్ పోస్ట్ చేస్తుండేది. కానీ వీరు ఈ మధ్య కలసి పోస్టులు పెట్టడం లేదు. కల్యాణ్ దేవ్, శ్రీజ ఎవరికి వారు తమ పనుల్లో బిజీ అయ్యారు. సింగిల్ పోస్టులనే ఎక్కువగా పెడుతున్నారు. దీనికి తోడు మెగా ఫ్యామిలీ ఏ వేడుక చేసుకున్నా అందులో కల్యాణ్ దేవ్ కనిపించడం లేదు. దీంతో శ్రీజ, కల్యాణ్ ఇద్దరూ విడిపోయారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై అటు శ్రీజ లేదా ఇటు కల్యాణ్ దేవ్ ఎవరూ ఈ వార్తలను ఖండించలేదు. దీంతో వీరు నిజంగానే విడిపోయారనే వార్తలకు బలం చేకూరినట్లు అయింది.
అయితే శ్రీజ ఇటీవలే తన సోదరుడు చరణ్‌తో కలిసి ముంబైలో కొన్ని రోజులు సరదాగా గడిపి తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. తరువాత పెద్దగా అప్‌డేట్స్ ఏమీ పెట్టలేదు. హోలీ రోజు మాత్రం తమ కుమార్తెలకు చెందిన ఫొటోలను శ్రీజ, కల్యాణ్ ఇద్దరూ పోస్ట్ చేశారు. కానీ అది వేర్వేరుగానే. అయితే ఇప్పుడు శ్రీజ మళ్లీ సింగిల్‌గానే కనిపించింది. వంట గదిలో ఏదో వండుతూ ఆ ఫొటోను పోస్ట్ చేసింది. దానికి కాప్షన్ కూడా పెట్టింది. ఏం వండుతున్నానో చెప్పండి చూద్దాం.. అని ప్రశ్నించింది. అయితే శ్రీజ ప్రస్తుతం తీవ్ర విచారంలో ఉందని.. కల్యాణ్‌తో కూడా విడిపోయింది కాబట్టి కాస్త డిప్రెషన్‌లో ఉందని.. అందుకనే ఏదో ఒక పని పెట్టుకుని అందులో బిజీగా మారుతుందని తెలుస్తోంది.

ఇక గతంలో పలు మార్లు స్వయంగా కళ్యాణ్.. శ్రీజ వంట గురించి వివరించాడు. శ్రీజ అసలు వంట చేయదని అన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఆమె వంట గదిలో బిజీగా ఉంది. దీంతో కల్యాణ్ జ్ఞాపకాల నుంచి బయట పడేందుకే ఆమె ఇలా ఏదో ఒక పని కల్పించుకుని మరీ అందులో బిజీగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి వీరి విడాకులపై ఎలాంటి విషయం కూడా అధికారికంగా బయటకు రాలేదు. కానీ త్వరలోనే ఏదో ఒక విషయం చెబుతారని తెలుస్తోంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.