Komuram Bheemudo : ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి కొన్ని ఏళ్లపాటు శ్రమించింది. బాహుబలి నుంచి ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని ఆశించినవాళ్ళ నిరాశకి చోటే లేకుండా చేశాడు రాజమౌళి. ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో ఎక్కువ భాగం జనాలను ఆకర్షించడానికి కమర్షియల్ అంశాలు ఉంటాయి. బాహుబలి అనంతరం టాలీవుడ్ టాప్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమురం భీమ్‌ల ఫిక్షన్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. తాజాగా ప్రముఖ హోస్టులు జోష్ ఓల్సన్, జో డాంటే పోడ్‌కాస్ట్ కు రాజమౌళి హాజరయ్యారు. పోడ్‌కాస్ట్‌లో రాజమౌళి తనకు స్ఫూర్తినిచ్చిన చిత్రాల గురించి మాట్లాడారు.
వారితో మాట్లాడుతున్నప్పుడు ఆర్ఆర్ఆర్ రెండవ భాగంలో కొమరం భీముడో పాట వెనుక మెల్ గిబ్సన్ తీసిన బ్రేవ్‌హార్ట్ మూవీ తనకు గొప్ప ప్రేరణ అని రాజమౌళి వెల్లడించారు. నేను ఆ మూవీ క్లైమాక్స్ నుండి ప్రేరణ పొందాను అని జక్కన్న వెల్లడించాడు. అలాగే మెల్ గిబ్సన్ తనకు ద్రోణాచార్యుడని నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని అని రాజమౌళి అన్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్ వచ్చే ఏడాది ఆస్కార్‌కి నామినేట్ అయ్యే అవకాశం ఉందని అలాగే విదేశీ ఫిల్మ్ విభాగంలో అవార్డు కూడా గెలుచుకోవచ్చని అనురాగ్ కశ్యప్ ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…