Khiladi Movie : మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం.. ఖిలాడి. ఇందులో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కానుంది. దీనికి రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. అయితే విడుదల కాకముందే ఈ మూవీ భారీగా బిజినెస్ చేసింది. దీంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

కాగా ఖిలాడీ మూవీ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. అందువల్ల ఈ మూవీ ఆ యాప్‌లో స్ట్రీమ్ కానుంది. ఫిబ్రవరి 11వ తేదీన మూవీ రిలీజ్ అయితే.. 35 రోజుల తరువాత.. అంటే.. మార్చి 18వ తేదీన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది.
పెన్ మూవీస్, ఎ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించగా.. ఇందులో అర్జున్ సర్జా, ముకేష్ రిషి, రావు రమేష్ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.