Kerala Auto Driver : కేరళలో ప్రభుత్వం మెగా ఓనం లాటరీలో రూ. 25 కోట్లు గెలిచాడు ఓ ఆటో డ్రైవర్. దీంతో ఈ విషయం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ లాటరీలో ఇన్ని కోట్లు గెలవడం ప్రజల్ని ఆకర్షించింది. అయితే ఇప్పుడు ఆ లాటరీ విన్నర్ అనూప్ బాధపడుతున్నాడు. నేను ఎందుకు లాటరీని గెలిచానని.. గెలవకుంటే బాగుండేదని భావిస్తున్నాడు. నేను మనశ్శాంతిని కోల్పోయాను.. ప్రస్తుతం నేను నా సొంత ఇంటిలో కూడా నివసించలేకపోతున్నానని ఆయన వాపోతున్నాడు. నేను లాటరీ గెలిచినప్పటి నుంచి ప్రజలు వాళ్ళ సమస్యలు చెబుతూ.. అవసరాలు తీర్చమని నన్ను అడగడానికి వస్తున్నారని.. నేను ఇంటికి వచ్చే వారితో ఇబ్బంది పడుతున్నాను అన్నాడు అనూప్.
రూ.25 కోట్ల లాటరీలో పన్ను, ఇతర బకాయిలు అన్ని మినహాయింపులు పోయిన తరువాత ఆయనకు ప్రైజ్ మనీగా రూ. 5 కోట్లు రానున్నాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నా.. తాను ఇప్పుడు మనశ్శాంతిని కోల్పోయానని చెపుతున్నాడు. ఈ విషయాన్ని జీ న్యూస్ లో ప్రచురించింది. నేను ఆ డబ్బులు గెలవకుంటే ఉంటే బాగుడేందనని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. చాలా మందిలాగే నేను కూడా 1, 2 రోజులు వార్తల్లో నిలిచినందుకు నిజంగా ఆనందించాను. కానీ ఇప్పుడు అదే ప్రమాదంగా మారింది. ఆ డబ్బును ఏమి చేయాలో నేను ఇంకా నిర్ణయించుకోలేదు.
ప్రస్తుతానికైతే ఆ డబ్బుని రెండేళ్ల పాటు బ్యాంకులో వేస్తాను. అయితే ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఉండే బదులు కొంత తక్కువగానే ఉంటే బాగుండేది అనిపిస్తోందని ఆయన అన్నాడు. తనకు తెలిసిన చాలా మందే ఇప్పుడు శత్రువులుగా మారే అవకాశం ఉందని అనూప్ వాపోయాడు. నన్ను వెతుక్కుంటూ చాలామంది వస్తున్నారు. మా ఇంటి చుట్టుపక్కలే తిరుగుతున్నారు. దీంతో మా ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలుగుతుంది. దీంతో వారు కూడా ఇప్పుడు నాపై కోపంగా ఉన్నారు. నా మనశ్శాంతి అంతా పోయింది అని అనూప్ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…