Keerthy Suresh : తెలుగులో మహానటి చిత్రం ద్వారా కీర్తి సురేష్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఆమె దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. దీంతో ఆమెకు పలు వరుస సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అయితే మహానటి తరువాత అంతగా చెప్పుకునే హిట్‌లేవీ ఈమెకు రాలేదు. అయినప్పటికీ అవకాశాలు మాత్రం పుష్కలంగానే వస్తున్నాయి.
ఇక కీర్తి సురేష్ తాజాగా యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తన చానల్‌ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, తన చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని, అందులో వచ్చే వీడియోలను వీక్షించాలని.. కీర్తి సురేష్ కోరింది.
కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం గుడ్ లక్ సఖి. ఈ మూవీ ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ఇందులో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి షూటింగ్ చాంపియన్‌గా ఎలా మారింది ? అన్న కథను చూపించనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై ఆకట్టుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…