Ram Charan Upasana : నటుడు రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఈమె పెట్టే పోస్టులు అందరినీ ఆలోచింపజేస్తుంటాయి. ఉపాసన ఎప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇందుకు గాను ఆమె నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు మాత్రం కొందరి ఆగ్రహానికి కారణమవుతోంది. ఆమె పోస్టు వివాదాల్లో నిలిచింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు తెలిపిన ఉపాసన ఓ ఆలయం ఫొటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఆ ఆలయ గోపురంలో సూక్ష్మ రూపంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. వారి మధ్యలో తాను, తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నామని.. తాము ఆ ఫొటోలో ఎక్కడ ఉన్నామో కనుక్కోండి.. అంటూ ఉపాసన ఓ ఫొటోను షేర్ చేశారు.
వాస్తవానికి ఫొటో ఆలయ శిఖరందే అయినప్పటికీ దాన్ని ఎడిట్ చేశారు. ఆ శిఖరంపై ప్రజలు సూక్ష్మ రూపంలో ఉన్నట్లుగా ఫొటోను ఎడిట్ చేశారు. దీంతో ఆ ఫొటోను ఎడిట్ చేసింది ఎవరో చెప్పాలని ఉపాసన కోరారు.
అయితే ఉపాసన షేర్ చేసిన ఈ ఫొటో వివాదానికి కారణమైంది. ఆలయ శిఖరం ఎంతో పవిత్రమైందని, దానిపై మనుషులు ఉండేలా ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ నిజంగా ఎవరో తెలిస్తే చెప్పండి.. అసలైన సన్మానం చేస్తాం.. అని నెటిజన్లు అంటున్నారు. ఈ విధమైన ఫొటోను షేర్ చేసిన ఉపాసనపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులను అవమానించేలా వ్యవహరించారని.. వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని, ఆ ఫొటోను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఉపాసన స్పందించాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…