Feng Shui Coin : మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కొందరికి లక్ ఎల్లవేళలా కలసి వస్తుంటుంది. దీంతో వారు ఏం చేసినా అందులో విజయం సాధిస్తారు. అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడి పనిచేసినా లక్ కలసి రాదు. ఏ పనిలోనూ విజయం సాధించలేకపోతుంటారు. పైగా ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కింద చెప్పిన విధంగా కాయిన్‌ను దగ్గర పెట్టుకుంటే అదృష్టం కలసి వస్తుంది. దీంతో వారు ఏం చేసినా విజయం సాధిస్తారు.
ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం మనకు మార్కెట్‌లో ఫెంగ్ షుయ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి భిన్న రకాలుగా ఉంటాయి. వాటిలో ఏ నాణేలను అయినా సరే కొని తెచ్చి ముందుగా ఉప్పు నీటితో శుభ్రం చేయాలి. దీంతో వాటిపై ఉండే నెగెటివ్ ప్రభావం పోతుంది. తరువాత ఆ కాయిన్స్‌ను ఇంట్లో లేదా ఆఫీస్‌లో పలు భిన్న ప్రదేశాల్లో ఉంచడం వల్ల భిన్నమైన ఫలితాలను పొందవచ్చు.
ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద ఫెంగ్ షుయ్ కాయిన్‌కు దారం కట్టి వేలాడదీయాలి. దీంతో ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాదు. ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లో ఉండే అందరికీ సమస్యలు తొలగిపోతాయి. కష్టాలు తప్పుతాయి.
ఇక ఇంట్లో ధనం ఉంచే చోట లేదా మహిళలు హ్యాండ్ బ్యాగుల్లో, పురుషులు పర్సుల్లో ఒక ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచుకోవాలి. దీంతో వారు ధనం బాగా సంపాదిస్తారు. లక్ కలసి వస్తుంది. ఏ పని చేసినా ఆటంకం లేకుండా సజావుగా పూర్తవుతుంది. అన్ని విధాలుగా అదృష్టం కలసి వస్తుంది. ధనవంతులు అవుతారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు.
దంపతులు ఇంట్లో బెడ్ రూమ్‌లో ఏదైనా షెల్ఫ్‌లో లేదా టేబుల్ మీద ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచాలి. దీంతో వారి మధ్య ఉండే కలహాలు, గొడవలు తగ్గుతాయి. వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుంది.
వ్యాపారులు అయితే తమ కార్యాలయాల్లో లేదా పనిచేసే చోట, ఉద్యోగులు అయితే తమ డెస్క్ వద్ద ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచాలి. దీంతో వారు ఆయా రంగాల్లో రాణిస్తారు. వ్యాపారులకు వ్యాపారంలో కలసి వస్తుంది. లాభాలు సంపాదిస్తారు. వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. అదే ఉద్యోగులకు అయితే కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ఇలా ఫెంగ్ షుయ్ కాయిన్స్‌ను భిన్న విధాలుగా ఉపయోగించడం వల్ల భిన్న రకాల ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…