Kajal Aggarwal : గౌతమ్ కిచ్లును కాజల్ అగర్వాల్ వివాహం చేసుకుని ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ చాలా రోజుల కిందటే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ప్రస్తుతం ఈమె భర్తతో కలసి దుబాయ్‌లో వెకేషన్‌లో ఉంది. అందులో భాగంగానే ఈమె తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వాటిల్లో కాజల్ అగర్వాల్ గర్భం స్పష్టంగా కనిపిస్తుండడం విశేషం.
అయితే ఆమె ఆ ఫొటోలను షేర్ చేయడంతో కొందరు నెటిజన్లు సహజంగానే తమ నోళ్లకు పదును పెట్టారు. రకరకాల కామెంట్లు చేశారు. కాజల్ ఇలా అయిపోయిందేమిటి, బాగా లావుగా అయింది.. అంటూ బాడీ షేమింగ్ కామెంట్లను మొదలు పెట్టారు. అయితే అన్నింటికీ ఆమె దీటుగా బదులిచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఓ పోస్ట్ పెట్టింది.
నా జీవితంలో ఇవి నాకు అత్యంత మధురమైన క్షణాలు. నా శరీరంలో, నా ఇంట్లో అనేక మార్పులు వస్తున్నాయి. గర్భం దాల్చిన సమయంలో మహిళల్లో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా శరీరంలో హార్మోన్ల ప్రభావం వల్ల బరువు పెరుగుతారు. వక్షోజాలు, పొట్ట పెద్దగవుతాయి. బిడ్డకు పాలివ్వడం కోసమే శరీరంలో అలాంటి మార్పులు వస్తాయి. అలాగే చర్మంపై స్ట్రెచ్ మార్కులు కూడా వస్తాయి. కానీ వాటిని నేను పట్టించుకోను.. అని కాజల్ అగర్వాల్ తాను పెట్టిన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
ఇక తనలో వస్తున్న మార్పుల గురించి, తాను బరువు పెరగడంపై కొందరు చేస్తున్న కామెంట్లను, బాడీ షేమింగ్‌ను తాను పట్టించుకోనని.. ఇవి సహజంగానే అందరు మహిళా సెలబ్రిటీలకు ఎదురవుతుంటాయని తెలిపింది. ఇలాంటి కామెంట్లను పట్టింకోవాల్సిన అవసరం లేదని, తనకు ఈ క్షణాలు అత్యంత విలువైనవని.. కాజల్ అగర్వాల్ తెలియజేసింది. కాగా ఈమె చివరిగా మెగాస్టార్ చిరంజీవి పక్కన ఆచార్య మూవీలో నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఈమె వివాహం చేసుకోవడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…