Kasthuri Shankar : గృహలక్ష్మీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి కస్తూరీ శంకర్. ఈ అమ్మడు సమాజంలో జరిగే సమస్యలపై స్పందిస్తూ ఉంటుంది. కస్తూరి స్వతాహాగా లాయర్ కావడంతో ఏ ఇష్యూ అయినా సరే వెంటనే తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఇటీవల షారుఖ్ ఖాన్ తనయుడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది కస్తూరి. దీంతో ఆమెపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక వచ్చే ఏడాది గోవాలో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) పోటీ చేయబోతుంది. దీంతో ఈ పార్టీ మానిఫెస్టో ప్రకటించింది. గోవాలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. హిందువులకు అయోధ్య.. క్రిస్టియన్స్ కు వేలాంకణి.. ముస్లీంలకు అజ్మీర్ షరిష్, సాయిబాబాను చూడాలనుకునేవారికి షిరిడీకి ఉచితంగా పంపిస్తాం. రవాణా సౌకర్యాలు ఉచితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Announcing :
AAP travels and tours.
coming soon: Goan Sikhs to Amritsar , Jains to Mt Abu and Parsis to Teheran.
Atheists in Goa will be given Casino money to stay and play in Goa itself. https://t.co/19JS0ttwqe— Kasturi (@KasthuriShankar) November 1, 2021
కస్తూరి కూడా ఈ ఇష్యూపై స్పందిస్తూ.. ఆప్ ట్రావెల్స్ అండ్ టూర్స్.. కమింగ్ సూన్.. గోన్ సిక్స్ అమృత్ సర్.. జైనులు మౌంట్ అబు.. పార్శీలు టెహరాన్.. ఇక నాస్తికులకు గోవాలో కేసివో తరహాలో డబ్బులు ఇస్తాం ఆడుకోండి ఎంజాయ్ చేసుకోండి.. అన్నట్టుగా ట్వీట్ పెట్టింది. దీంతో ఆ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే కస్తూరి కామెంట్స్‌పై కూడా కొందరు నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.