Karthikeya : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక సినిమాల్లో సెటిల్ అవ్వడంతో మ్యారేజ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇద్దామనుకుంటున్నారు. తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వబోతున్నారు. ఈ సందర్భంగా తన లవ్ స్టోరీ ఎలా సక్సెస్ అయ్యిందనే విశేషాల్ని షేర్ చేసుకున్నారు. కార్తికేయ ఫస్ట్ టైమ్ 2010లో నిట్ వరంగల్ లో లోహితను కలిశారట. 2012 లో ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత సంవత్సరానికి లోహిత తన లవ్ ని ఒప్పుకున్నారట.
బీటెక్ చదువుతున్నప్పుడు లోహిత, కార్తికేయకు ఓ మెసెజ్ పంపారట. ఆ మెసేజ్ తో కార్తికేయ ఇంట్లో పెద్ద గొడవే జరిగిందట. ఆ సమయానికి ప్రాంక్ అని చెప్పి కార్తికేయ తప్పించుకున్నారట. అలా తమ ప్రేమ గురించి వారి పేరేంట్స్ మూడు నెలల క్రితమే తెలిసిందట. లోహితను లవ్ చేస్తున్న విషయాన్ని ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే చెప్పారని, ఆ తర్వాత లోహిత ఇంట్లో వాళ్ళకు చెప్పారని తెలిపారు. అలా తమ మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్, ప్రేమ గురించి ఎంతో కాలంగా అందరికీ చెప్పి.. అర్థం చేసుకుని పెళ్ళికి ఒప్పించడం అనేది చాలా హ్యాపీగా ఉందని అన్నారు.
రీసెంట్ గా రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ లో లోహితకు ప్రపోజ్ చేశారు. ఇన్నాళ్ళ లవ్ లో ఎప్పుడూ లోహితకు ప్రపోజ్ చేయలేదని అన్నారు. ఫోన్ లో నువ్వంటే ఇష్టమని అన్నారు. ఐ లవ్ యూ అని చెప్పలేదని కార్తికేయ అన్నారు. లైఫ్ మొత్తం వారిద్దరికీ ఓ మెమరబుల్ మూమెంట్ లా ఉండాలని అలా స్టేజ్ మీద ప్రపోజ్ చేసినట్లు కార్తికేయ తెలిపారు. తెలుగు సినిమాలతోపాటు కోలీవుడ్ లోకి కూడా కార్తికేయ ఎంట్రీ ఇచ్చారు.