Karthikeya : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ చాలా రోజుల తరువాత కార్తికేయ 2 ద్వారా చక్కని విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అయింది. దీంతో నిఖిల్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టింది. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ మూవీ హిట్ అయిన నేపథ్యంలో కార్తికేయ 3 ఉంటుందా.. లేదా.. అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం ఇచ్చాడు.
కార్తికేయ 3 సినిమాను తీస్తామని నిఖిల్ చెప్పాడు. అయితే ఈ మూవీని ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. వంటి వివరాలను మాత్రం నిఖిల్ వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక కార్తికేయ 3 మూవీని 3డిలో రిలీజ్ చేస్తామని కూడా నిఖిల్ వెల్లడించాడు. కాగా కార్తికేయ 2లో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రను పోషించారు. ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు.
ఇక కార్తికేయ 2 మూవీని శ్రీకృష్ణుడి కథాంశంతో తెరకెక్కించారు. కృష్ణుడికి చెందిన ఒక కాలి పట్టీ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఉత్తరాదిలో కృష్ణుడికి చాలా మంది పూజలు చేస్తారు. కనుకనే సినిమా హిట్ అయిందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…