Karthikeya 2 : థియేటర్ల వద్ద కార్తికేయ 2 దూకుడు స్పష్టంగా కనబడుతోంది. యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మూడో రోజుకు బ్రేక్ ఈవెన్ సాధించిన కార్తికేయ 2, నాలుగు రోజుల తర్వాత నిఖిల్ కెరీర్‌లో టాప్ గ్రాసర్‌గా నిలవడం విశేషం. రోజు రోజుకూ కార్తికేయ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఇటు తెలుగులో, అటు హిందీలోనూ కార్తికేయ 2కు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.
కార్తికేయ 2 మూవీ మూడో రోజు సాధించిన కలెక్షన్స్ ఆ రోజుకి టోటల్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమాలు అన్నింటిలో కూడా రెండో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. ఆగస్ట్ 15న ఇండియాలో రన్నింగ్ లో ఉన్న సినిమాలు అన్నింటిలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా రూ.9.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రాగా, ఆ రోజుకి అదే హైయెస్ట్ గా నిలిచింది.

ఇక రెండో ప్లేస్ లో కార్తికేయ 2 మూవీ ఉంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.6.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా హిందీలో రూ.1.25 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. ఇక మిగిలిన చోట్ల మొత్తం మీద మరో రూ.55 లక్షల దాకా గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా టోటల్ గా ఆ రోజు ఇండియాలో రూ.8.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాల్ సింగ్ చడ్డా తర్వాత సెకండ్ ప్లేస్ లో కార్తికేయ 2 నిలిచింది.
ఇక ఇతర సినిమాల విషయానికి వస్తే.. తమిళ్ లో కార్తి హీరోగా వచ్చిన విరుమన్ సినిమా ఆల్ మోస్ట్ రూ.7.70 కోట్లు వసూలు చేయగా, హిందీలో అక్షయ్ కుమార్ నటించిన రక్షా భందన్ సినిమా రూ.7.40 కోట్ల గ్రాస్ ను అందుకుంది. తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన కార్తికేయ2 బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ చిన్న మూవీగా వచ్చి సునామీ సృష్టించింది కార్తికేయ 2. ఈ వారం కృష్ణాష్టమి కూడా ఉండడంతో ఇంకో వారం రోజులు కార్తికేయ 2 ఓ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుందని చెప్పవచ్చు.