Karthikeya 2 : కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా ఆగస్ట్ 13న కార్తికేయ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు హీరో నిఖిల్. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కార్తికేయ 2 చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నిఖిల్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్య మీనన్, సత్య, తులసి, ప్రవీణ్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.
కార్తికేయ 2 చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకత్వం వహించారు. 340 థియేటర్లలో విడుదలైన కార్తికేయ 2 తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన కార్తికేయ 2కు అన్ని భాషల్లోనూ మంచి స్పందన లభిస్తోంది. శనివారం హిందీలో విడుదలైన కార్తికేయ 2 చిత్రం కేవలం 50 శాతం థియేటర్లకు మాత్రమే పరిమితమైంది. హిందీ థియేటర్స్ ఓనర్స్ సైతం హిందీ వర్షన్ ను 150 థియేటర్లకి పెంచమని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇక మొదటి రోజే రూ.2.50 కోట్ల నుండి రూ.3 కోట్ల వరకు ఓపెనింగ్స్ వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ దిశగా దూసుకుపోతూ దాదాపు తొలి రోజే 30 శాతం వరకు వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.8.80 కోట్ల గ్రాస్ ను, రూ.5.10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను సాధించింది.
ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే రూ.5.40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. కార్తికేయ 2 చిత్రం రిలీజ్ తో బింబిసార, సీతారామం వసూళ్ల జోరు తగ్గినట్లు తెలుస్తోంది. ముందు ముందు కార్తికేయ 2 సక్సెస్ టాక్ తో ఎంత లాభాన్ని వెనకేసుకుంటుందో వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…