Akhanda : నందమూరి నటసింహం బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ లాంటి చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో వేరే చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఘన విజయాన్ని సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం అఖండ. అఖండ చిత్రం కూడా విజయం సాధించి బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ కు హ్యాట్రిక్ ను అందించింది.
విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.44 కోట్ల షేర్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అఖండ చిత్రంలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రంలో మురళీకృష్ణగా, అఖండ (అఘోర) గా అద్భుతమైన నటనను కనబరిచారు. అఖండ చిత్రంలో అఘోర క్యారెక్టర్ కు హీరోయిన్ తో అవసరం ఉండదు. కానీ ఫస్ట్ హాఫ్ లో కనిపించిన బాలయ్య మురళీకృష్ణ పాత్రకు హీరోయిన్ అవసరం.
మురళీకృష్ణ పాత్రకు భార్యగా ప్రగ్య జైస్వాల్ అత్యద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రగ్యా జైస్వాల్ కంటే ముందుగా బోయపాటి ఈ చిత్రంలో నటించడానికి బాలయ్య స్టార్ రేంజ్ ని దృష్టిలో పెట్టుకుని నలుగురు హీరోయిన్స్ ని సంప్రదించారట.
ముందుగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్, పాయల్ రాజ్ పూత్ వంటి హీరోయిన్లను సంప్రదించగా కొన్ని కారణాల వలన ఈ హీరోయిన్స్ నలుగురు బాలయ్యతో నటించడానికి నో చెప్పారట. ఈ హీరోయిన్స్ నో చెప్పడంతో ఆ చాన్స్ ప్రగ్య జైస్వాల్ ని వరించింది. ఈ క్రమంలోనే సినిమా హిట్ అవడంతో ప్రగ్యాకు మంచి పేరు వచ్చింది. అయినప్పటికీ ప్రగ్యాకు ఆఫర్లు రావడం లేదు. మరి రానున్న రోజుల్లో అయినా ఈ బ్యూటీ ఆఫర్లను దక్కించుకుంటుందో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…