Karthika Pournami 2022 : ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి వచ్చేసింది. భక్తులు కార్తీక స్నానాలు ఆచరిస్తూ శివుడికి అభిషేకాలు చేస్తున్నారు. ఈ సమయంలో శైవ క్షేత్రాల్లో సందడి నెలకొంటుంది. భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపం వెలిగిస్తారు. కార్తీక మాసం ముగిసే వరకు ఇలాగే చేస్తారు. అలాగే భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అన్ని నియమాలను పాటిస్తారు. అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు పరమశివుడికి ఎంతో పవిత్రమైన దినం. కనుక భక్తులు తప్పక పూజలు చేయాలి.
ఇక ఈసారి కార్తీక పౌర్ణమి నవంబర్ 8, 2022 మంగళవారం వచ్చింది. సాధారణంగా శివుడికి ఏడాది మొత్తం పూజలు చేసేవారు ఉంటారు. రోజూ ఉదయాన్నే లేచి స్నానం చేసి శివుడికి పూజలు చేసి దీపం వెలిగిస్తారు. అయితే ఏడాది మొత్తం ఇలా చేయకపోయినా ఫర్వాలేదు. కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం తప్పక శివుడికి పూజలు చేయాలి. ఉదయం స్నానం ముగిశాక శివుడికి పూజలు చేసి సరిగ్గా 365 ఒత్తులతో దీపాలను వెలిగించాలి. అంటే సంవత్సరం మొత్తం వెలిగించే దీపాలతో ఒకే రోజు శివున్ని పూజిస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం పూజలు చేసిన ఫలితం ఒక్క రోజే లభిస్తుంది. ఇది కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత అని చెప్పవచ్చు.
కార్తీక పౌర్ణమి రోజు వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోవద్దని పండితులు చెబుతున్నారు. ఇక కార్తీక మాసంలో శివుడికి రుద్రాభిషేకం చేయడంతోపాటు బిల్వ పూజ చేస్తే ఎంతో మంచిది. అలాగే విష్ణువుకు కూడా పూజలు చేయాలి. విష్ణు సహస్రాబ్ది ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. దీంతోపాటు కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో మనం వెలిగించే దీపాలు మన జీవితాల్లో వెలుగులను నింపుతాయి. అలాగే మన పాపాలను కడిగేస్తాయి. ఎంతో పుణ్యం లభిస్తుంది. మనం సన్మార్గంలో నడిచేందుకు కార్తీక పౌర్ణమి దోహదపడుతుంది. కనుక ఈ అవకాశాన్ని అసలు విడిచిపెట్టుకోరాదు. 365 ఒత్తులతో దీపాలను తప్పక వెలిగించాలి. సూర్యోదయానికి ముందే ఇలా చేయాలి.
కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ చెట్టుకు పూజలు చేస్తే ఎంతో మంచిది. దీని గురించి శివ పురాణంలో చెప్పారు. అలాగే గోపూజ చేయాలి. దీంతోపాటు సూర్యోదయానికి ముందే నదులు లేదా సరస్సుల్లో స్నానం ఆచరించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…