Deeparadhana : కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. భక్తులు రోజూ పూజలు చేస్తుంటారు. ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడు రాకముందే దీపం పెడుతుంటారు. ఈ మాసం మొత్తం అలాగే చేస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దీపాలను వెలిగిస్తుంటారు. దీంతో సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. అయితే దీపారాధన విషయంలో కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టీల్ కుందులో దీపారాధన చేయరాదు. ఎట్టి పరిస్థితిలోనూ మట్టితో చేసిన కుందులనే వాడాలి. అలాగే అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. ఒక వత్తి దీపాన్ని చేయరాదు. దీన్ని చనిపోయిన వారి దేహం వద్ద వెలిగిస్తారు. కనుక ఇలా చేయకూడదు. దీపాన్ని అగర్‌బత్తీతో మాత్రమే వెలిగించాలి.
దీపారాధన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షతలు వేయాలి. విష్ణువుకు దీపారాధన చేస్తే దీపాన్ని ఆయన కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. అలాగే దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమఃశివాయ అని జపించి మళ్లీ దీపం వెలిగించాలి. ఇలా ఈ మాసంలో దీపారాధన విషయంలో జాగ్రత్తలను పాటించాలి. దీంతో ఈశ్వరుడి కరుణా కటాక్షాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…