Karthika Deepam : బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా మోనిత తన కొడుకు బారసాలకి రావాలని కార్తీక్ కుటుంబాన్ని ఆహ్వానించగా అందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ దీప మాట ఇస్తుంది. దీప మాటలకు అందరూ షాక్ అవుతారు. ఇక అక్కడి నుంచి వెళ్లిన మోనిత కంగారు పడుతుంది. ఇక గుడికి వెళ్ళాలి అని బయలుదేరిన దీప.. అత్తయ్య మీరు గుడికి ఎలాగో రారు, నేను, పిల్లలు వెళ్లి వస్తాం.. అంటూ బయలు దేరుతారు.
దీప ప్రవర్తన చూసి కార్తీక్, సౌందర్య, ఆనందరావు ఆందోళన చెందుతారు. దీపకి నిజం తెలిసినా ఇలా నవ్వుతూ మాట్లాడుతుంది, అసలు ఏం నిర్ణయం తీసుకుంది.. అంటూ సౌందర్య బాధపడుతుంది. తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలనుకున్నా ఎంతో భయంగా ఉందిరా.. అంటూ మాట్లాడుతుంది. ఇక దీపకు నిజం చెప్పేస్తాను మమ్మీ, అప్పుడైనా కొంచెం టెన్షన్ తగ్గుతుంది.. అని అనుకుంటాడు.
మోనిత కారులో ఇంటికి వెళ్తూ.. దీప అన్న మాటలను గుర్తు చేసుకుని భయపడుతుంది. అసలు విషయం తెలిసి అస్తమిస్తున్న సూర్యుడి వైపు పయనిస్తుంది అనుకుంటే దీప ఎలా మాట్లాడుతుంది.. అంటూ కంగారు పడుతుంది. అయినా నా వైపు ఆనందరావు గారు ఉన్నారు, నేను విజయంలోనే ఉన్నాను.. అంటూ తనకు తాను సర్ది చెప్పుకుంటుంది.
ఇక గుడికి వెళ్ళిన పిల్లలతో దీప ఎంతోసంతోషంగా గడుపుతూ గుడి నుంచి పిల్లలను రెస్టారెంట్ కు తీసుకెళ్తుంది, మీకేం కావాలో అవన్నీ తినండి, మీకు అడ్డు చెప్పనని అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇక కుటుంబ సభ్యులు ఊహించిన విధంగానే గుడి నుంచి కేవలం పిల్లలు మాత్రమే ఇంటికి తిరిగి వస్తారు. అమ్మ ఏది.. అని అడగడంతో అమ్మ వెళ్ళిపోయింది, అమ్మమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్ళింది, రేపు మీరు అందరూ ఎక్కడికో వెళ్తారు అంట కదా.. అక్కడ నుంచి వస్తానని చెప్పింది.. అనడంతో వారందరూ షాక్ అయ్యి వెంటనే దీపకి ఫోన్ చేస్తాడు కార్తీక్. అప్పటికే దీప ఫోన్ స్విచాఫ్ వస్తుంది. మరి దీప ఇవ్వబోయే షాక్ ఏంటో తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…